108 నేడు జన్మదినోత్సవం
తుమకూరులో పండగ వాతావరణం
తుమకూరు : నడియాడే దేవుడిగా పేరుపొందిన సిద్ధగంగామఠం పీఠాధిపతి డాక్టర్ శివకుమార స్వామీజీ బుధవారం 108వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ మేరకు తుమకూరులోని సిద్ధగంగ మఠంలో వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం రాయల్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని వీధుల్లో బులెట్లతో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మఠం నుంచి స్వామీజీని ఊరేగింపుగా జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు స్వామీజీని తీసుకెళతారు.
స్వామీజీతో పాటు సిరిగెరె తెరళు బాలు సంస్థానం అధిపతి శివమూర్తి శివాచార్య స్వామీజీ, ఆదిచుంచునగిరి నిర్మలానందస్వామీజీ పాల్గొంటున్నారు. ఇప్పటికే తుమకూరులో ఎటు చూసిన పండుగ వాతావరణం నెలకొంది. స్వామీజీ ఫెక్సీలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. స్వామిజీ మఠం నుంచి వేదిక వద్దకు వచ్చే మార్గంలో పచ్చ తోరణాలు, పూలు, మామిడి ఆకులు, అరటి కొమ్మలతో తోరణాలను ఏర్పాటు చేసారు.