పడవ బోల్తాపడి ఇద్దరి మృతి | 2 fishermen died due to boat roll at srikakulam district | Sakshi
Sakshi News home page

పడవ బోల్తాపడి ఇద్దరి మృతి

Published Thu, Sep 29 2016 3:23 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

2 fishermen died due to boat roll at srikakulam district

గార : శ్రీకాకుళం జిల్లా గార మండలం బందరువానిపేట సముద్రతీరంలో ఓ పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో బందరు వానిపేట గ్రామానికి చెందిన శివకోటి ముని(55), శివకోటి పూర్ణ స్వామి(23) అనే ఇద్దరు మత్య్సకారులు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వేటకు వెళ్లిన ఏడుగురు మత్య్సకారులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మత్య్స కారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement