అయితే ఏంటి?
దక్షిణాది శృంగార తార సిల్క్‌స్మిత జీవిత చరిత్రతో రూపొందిన ది డర్టీ పిక్చర్ చిత్రంలో నటించి యావత్ భారత సినీ పరిశ్రమకు ఈ భామ షాక్ ఇచ్చారు. తాజాగా రజనీ, శ్రీదేవి లాంటివారిని ఆలోచనలో పడేసేలా పెద్ద షాక్ ఇచ్చారు. హిందీలో తెరకెక్కి న మేహు రజనీకాంత్ చిత్ర టైటిల్ తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందంటూ రజనీ కాంత్ కోర్టు కెళ్లి చిత్ర విడుదలపై స్టే తీసుకొచ్చారు. అదే విధంగా నటి శ్రీదేవి తన పేరుతో రామ్‌గోపాల్ వర్మ చిత్రం తెరకెక్కించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన సినిమా పేరు మార్చుకోక తప్పలేదు. అలాంటిదిప్పుడు తెలుగులో వేర్ ఈజ్ విద్యాబాలన్ పేరుతో ఒక తెలుగు చిత్రం రూపొందుతోంది.
ప్రిన్స్, జ్యోతిసత్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస దర్శకుడు. ఈ చిత్ర టైటిల్ ఉపయోగించడానికి నటివిద్యాబాలన్ అనుమతి తీసుకున్నారా? అన్న ప్రశ్నకు ఈ దర్శకుడేమన్నారో చూడండి. ఈ చిత్రంలో నటి విద్యాబాలన్‌ను అవమానించే సన్నివేశాలు ఉండవు. అయినా ఆమె పేరు చుట్టూనే కథ తిరుగుతుంది. దీని కోసం విద్యాబాలన్ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు అన్నారు. ఇదే ప్రశ్నపై నటి విద్యాబాలన్ స్పందిస్తూ నా పేరుతో ఒక తెలుగు చిత్రం రూపొందుతోందన్న విషయం నా చెవికి చేరింది. అయితే ఏంటి? ఆ చిత్రానికి నా పేరు పెట్టడం వలన నాకెలాంటి భయం లేదు. అని ఈ విషయాన్ని విద్యాబాలన్ చాలా స్పోర్టివ్‌గా తీసుకోవడం పరిశ్రమలో చాలామంది పరి పరి విధాలుగా గుసగుస లాడుకుంటున్నారు.