పిల్లి తెచ్చిన లొల్లి.. ఒకరి మృతి | A woman died while fight with neighbours | Sakshi
Sakshi News home page

పిల్లి తెచ్చిన లొల్లి.. ఒకరి మృతి

Published Mon, Jul 3 2017 7:39 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

A woman died while fight with neighbours

ముంబై: పెంపుడు పిల్లి తెచ్చిన లొల్లి ఓ మహిళ ప్రాణాలు బలితీసింది. ఈ విచారక ఘటన ముంబైలోని పింప్రిలో చోటుచేసుకంది. స్థానికంగా నివాసముంటున్న ప్రభా-రంగ్ పిసే కుటుంబం గత కొద్ది రోజులుగా పిల్లిని పెంచుకుంటుంది. ఈ పిల్లి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పక్కింటి నందకిషోర్ సాల్వే ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో వారు భోజనం చేస్తుండగా పిల్లి ప్లేట్ లో మూతి పెట్టింది. ఆగ్రహానికి గురైన నందకిషోర్ పిల్లిన బయటకు విసిరి పాడేశాడు.

ఈ విషయాన్ని నిలదీసేందుకు వెళ్లిన ప్రభాపై నందకిషోర్ కుటుంబ సభ్యులు కర్రలు, ఇనుప రాడ్ తో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రభాకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆమె మరణించింది. ఈ సంఘటనకు కారణమైన నలుగురిని స్థానికి హింజ్ వాడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement