కత్రినాకైఫ్, హృతిక్‌రోషన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’పై బాలీవుడ్‌లో అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ట్రయలర్స్ చూసిన తర్వాత సినీవిమర్శకులు సైతం ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ట్రయలర్స్ అద్భుతంగా ఉన్నాయని, హృతిక్, కత్రినా కెమిస్ట్రీ సూపర్ ్బ అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో హృతిక్ స్టంట్లు, శృంగార సన్నివేశాల్లో కత్రినా అందచందాలు చూడగానే ఆకట్టుకునేలా ట్రయలర్స్ ఉన్నాయని చెబుతున్నారు. బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా పిలిచే ఆమిర్‌ఖాన్ కూడా ట్రయలర్స్ అద్భుతంగా ఉన్నాయని ట్వీట్ చేశాడంటే ఇక ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రచారం అక్కరలేదనే అంటున్నారు సినీవిశ్లేషకులు.
‘బ్యాంగ్ బ్యాంగ్ సినిమా ట్రెయిలర్స్ చూశా. చాలా అద్భుతంగా అనిపించాయి. హృతిక్ రోషన్ చేసిన డ్యాన్స్‌లో కనీసం సగం కూడా నేను చేయలేనేమో. సినిమాలో ఓ పాట నాకు చాలా బాగా నచ్చింది. ట్రెయిలర్స్ చూసినవారికి సినిమాపై అంచనాలు అమాతంగా పెరగడం ఖాయం. హృతిక్-కత్రినాకైఫ్ జంటపై జనాలు కాసుల వర్షం కురిపించడం ఖాయం. ప్రత్యేకించి.. చేతిలో గన్ పట్టుకొని హృతిక్ రోషన్ నీళ్లలోనుంచి దూసుకొచ్చే సన్నివేశం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ సీన్‌ను చూసిన తర్వాత కూడా అక్టోబర్ 2 వరకు ఆగడం నా వల్ల కాదు.
ఆమిర్‌ఖాన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘పీకే’ సినిమా ప్రచారంలో ఎంతో బిజీగా ఉన్నా బ్యాంగ్ బ్యాంగ్ సినిమా ట్రయలర్స్ కోసం తాను ఎంతగానో ఎదురుచూశానని, విడుదల కోసం కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ఇలా బాలీవుడ్‌లో చాలామంది ప్రముఖులు ఈ సినిమా ట్రయలర్స్ గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే హృతిక్-కత్రినాల జోడీకి మంచి మార్కులు పడినట్లే కనిపిస్తున్నాయి.
కాసుల వర్షం ఖాయం
Published Tue, Sep 2 2014 10:03 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement