గుర్గావ్: నానాటికి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గుర్గావ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నగరంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డు ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు రోడ్డు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హుడా సిటీ సెంటర్ నుంచి సుభాష్ చౌక్ వరకు ప్రయోగాత్మక ఆడిట్ నిర్విహ ంచారు. ఈఎంబీఏఆర్‌క్యూ ఇండియా అనే సంస్థ భాగస్వామ్యంతో నగర పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీస్ కమిషనర్ అలోక్‌నాథ్ దీన్ని ప్రారంభించారు. పోలీసు అధికారులు, ఈఎంబీఏఆర్‌క్యూ ప్రతినిధులు కలిసి అత్యంత ప్రమాదకరమైన జోన్లను గుర్తించే ందుకు సుమారు 5.5 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్‌లో సర్వే ప్రారంభించారు.
ఈ సర్వేలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడమేకాకుండా అక్కడే ఎందుకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయాన్ని విశ్లేషించారు. ఈ ఆడిట్‌లో భాగంగా మొత్తం రోజంతా ఆ కారిడార్‌లో ప్రయాణించిన వాహనాల రద్దీ, వాటి వేగం తదితర విషయాలను కూడా గమనించారు. కాగా, ఈ కారిడార్‌లో సరాసరి 50 కి.మీ.వేగంతో వాహనాలు నడపాల్సి ఉండగా, వాహనదారులు అంతకంటే ఎక్కువ వేగంతో వాహనాలను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కారిడార్‌లో అనేక క్రాసింగ్‌లు ఉన్నాయని, వీటి సమీపంలో అతి వేగం వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఒక అధికారి విశ్లేషించారు.
ఈ కారిడార్‌లో జంక్షన్ల విస్తీర్ణాన్ని తగ్గిస్తే, వాహనాదారులు అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో వేగం తగ్గించాల్సి ఉంటుందని, దాంతో ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఈఎంబీఏఆర్‌క్యూ ప్రతినిధులు గుర్తించినట్లు ఆ సంస్థ ప్రతినిధి సారికా పండా తెలిపారు. అలాగే ఆయా జంక్షన్ల వద్ద పాదచారుల సిగ్నల్స్‌ను ఏర్పాటుచేయడం, వారు నిలబడి ఉండేందుకు తగిన స్థలాన్ని కేటాయించడం వంటి మార్పులు చేస్తే ప్రమాదాలు కొంతమేరకు తగ్గుతాయని ఆ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడినట్లు సారిక తెలిపారు. కాగా, వచ్చే మంగళవారం హుడా అధికారులతో మరోసారి సమావేశమై తాము తయారుచేసిన నివేదికపై చర్చిస్తామని ఆమె వివరించారు.
ఇదిలా ఉండగా, ప్రయోగాత్మకంగా నిర్వహిం చిన ఆడిట్ విజయవంతమైందని, త్వరలోనే మిగి లిన ప్రధాన రోడ్లపై ఆడిట్ నిర్వహిస్తామని కమిషనర్ మిట్టల్ తెలిపారు. ‘గుర్గావ్ రోడ్లపై ప్రమాదాల నివారణకు చాలా మంచి సూచనలు అందాయి. వాటిని అమలు చేయడం కూడా సులభమే.. రోడ్లపక్కన పేవ్‌మెంట్లు, సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటుచేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా..’మని ఆయన చెప్పారు. కాగా, హుడా సెంటర్ మెట్రో స్టేషన్, ఫోర్టిస్ ఆస్పత్రి, యునిటెక్ సిటీ పార్క్ వద్ద కూడా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ బృందం నివేదిక సమర్పించింది.
ప్రమాదాల నివారణకు ప్రణాళిక
Published Sat, Sep 6 2014 10:29 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
Advertisement
Advertisement