మండ్య, న్యూస్‌లైన్ : మండ్య పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ర మ్య సోమవారం తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 3న నామినేషన్ దాఖలు సమయంలో తన పెంపుడు తండ్రి ఆర్టీ నారాయణ గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. ఈ హఠాత్ పరిణామానికి తీవ్రంగా కుంగిపోయిన రమ్య ఒక దశలో ప్రచారం చేయనని భీష్మించుకు కూర్చున్నారు. పార్టీ నేతల ఓదార్పులతో సోమవారం ఉదయం రమ్య, మంత్రి అంబరీశ్‌తో కలిసి స్థానిక కాళికాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
దేవాలయం నుంచి బయటకు వస్తూనే ప్రచారం వాహనంలోనే తన తండ్రిని తలచుకుని రమ్య కన్నీంటి పర్యంత మయ్యారు. కొద్దిసేపు అనంతరం రమ్య ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పేటవీధి, హోళలు సర్కిల్, శంకరమఠం, కల్లహళ్లి, ఏపీఎంసీ మార్కెట్, కాత్యుంగెరె వినాయకుని దేవాలయం, చాముండేశ్వరి దేవాలయం వీది, నోరడి రోడ్డు, కర్ణాటక బార్ సర్కిల్, హొసహళ్లి మారమ్మ దేవాలయం సర్కిల్, పట్టణంలోని ప్రముఖ వీధుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో రాష్ట్ర కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు మంజుల నాయుడు, మంత్రి డాక్టర్ హెచ్‌సీ మహాదేవప్ప, నాయకులు రవి, చిదంబర్, నాగమని, రవికుమార్ మాహేష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసం రమ్యను గెలిపించండి : అంబరీశ్
మండ్య జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తు న్న బహుభాష నటి రమ్యను గెలిపించాలని నటుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీశ్ మండ్య వాసులకు విజ్ఞప్తి చేశాడు. మండ్యకు పట్టిన శని వదలాలంటే రమ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే జిల్లా అభివృద్ధి సాధ్యమని అంబరీశ్ గుర్తు చేశారు.
ప్రచారంలో రమ్య కన్నీటిపర్యంతం
Published Tue, Aug 13 2013 3:49 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement