ఇద్దరు ఏఈలపై సస్పెన్షన్ వేటు? | AE's suspension in ongole over Corruption | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఏఈలపై సస్పెన్షన్ వేటు?

Published Wed, Sep 28 2016 10:12 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

AE's suspension in ongole over  Corruption

► వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో 
అవకతవకలపై చర్యలు
► నేడో రేపో ఇంటికి
► సదరు అధికారులకు అండగా నిలబడిన తెలుగుతమ్ముళ్లు
 
ఒంగోలు : నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగంలోని ఇద్దరు ఏఈలను సస్పండ్‌ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓడీఎఫ్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో వీరు అవకతవకలకు పాల్పడటంతో పాటు పనుల్లో జాప్యం వహిస్తున్నారు. దీంతో నగరపాలక ఉన్నతాధికారులు కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. బహిరంగ మల విసర్జన అరికట్టేందుకు తీవ్రమైన కృషి చేస్తున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్‌ నుంచి చిన్నచిన్న ఉద్యోగుల వరకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు.

ఓడీఎఫ్‌ సాధించేందుకు బహిరంగ మల విసర్జన జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిలో అత్యాధునిక పిటుజడ్‌ వంటి కెమెరాలు అమర్చడం, క్రమం తప్పకుండా మైకు ద్వారా ప్రచారం నిర్వహించడం, కరపత్రాలు పంచడం వంటి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనిపై డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ కూడా నగరపాలక సంస్థ విడుదల చేసింది. ప్రభుత్వం ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15వేలు కేటాయించింది. ఈ నేపథ్యంలో సదరు ఏఈలు మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడినట్లు తెలిసింది. అయితే నగరపాలక సంస్థలో పెత్తనం చెలాయిస్తున్న తెలుగు తమ్ముళ్లు వారిపై ఈగ వాలకుండా కాపాడేందుకు అడ్డుపడుతున్నట్లు సమాచారం. దీనివల్లే జాప్యం జరుగుతోంది. ఇటీవలే సాక్షి దిన పత్రికలో మరుగుదొడ్లలో అవినీతి కంపు అనే కథనం ప్రచురితం కావడంతో లుకలుకలపై హడావుడి ప్రారంభం కావడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement