తిరువొత్తియూరు: ముఖ్యమంత్రి జయలలిత మృతిని తట్టుకోలేక ఆరు రో జులుగా అన్నపానీయాలు మాని తీవ్రశోకంలో మునిగిపోయాకార్యకర్త ఆది వారం మృతి చెందాడు. ధర్మపురి జిల్లా పెన్నగరం, చిన్నంపల్లి గ్రామానికి చెంది న గోవిందశెట్టి(67). ఇతను ఎంజీఆర్ ఉన్నప్పటినుంచి అన్నాడీఎంకే కార్యకర్తగా కొనసాగుతున్నాడు. జయలలితకు వీరాభిమాని.
ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మరణించిన వార్త విని దిగ్భ్రాంతి చెందిన గోవిందశెట్టి గత ఆరు రో జులుగా అన్నపానీయాలు మాని దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ఈ స్థితిలో ఆదివారం ఉదయం మృతి చెం దాడు. అన్నాడీఎంకే సమాఖ్య కార్యదర్శి కుమార్ సెల్వం, తమిళనాడు ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి అరుల్‌స్వా మి ఇతని మృతదేహానికి అంజలి ఘ టించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అన్నాడీఎంకే కార్యకర్త మృతి
Published Mon, Dec 12 2016 2:57 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
Advertisement
Advertisement