‘అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం’ | All India Democratic Students Organisation dharna in vishakapatnam | Sakshi
Sakshi News home page

‘అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం’

Published Thu, Dec 29 2016 12:19 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

All India Democratic Students Organisation dharna in vishakapatnam

విశాఖపట్నం: నిర్బయ ఉద్యమ స్పూర్తితో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని ఆలిండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులు పిలుపునిచ్చారు. విశాఖపట్నం నగరంలోని ఉమెన్స్ కాలేజీ నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకూ ర్యాలీ తీశారు. మీడియాలో మహిళలను అసభ్యకరంగా చూపుతున్నారని, ఈ విషయంలో మీడియా ధోరణి మారాలని, మహిళలను అసభ్యకరంగా చూపించే ఛానళ్లను వెంటనే నిషేంధించాలని డిమాండ్ చేశారు. మద్యాన్ని, మద్యం అమ్మకాలను నియంత్రించాలని కోరారు. నిర్భయ ఘటన జరిగిన నాలుగేళ్లు అయినా మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు ఆగటం లేదని, ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement