'తెలుగు భాషకు అన్ని అర్హతలు ఉన్నాయి'
చె న్నై: నిబంధనల ప్రకారమే తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించారని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ప్రాచీన హోదా పొందేందుకు తెలుగుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.
తెలుగు, కన్నడ, మలమాళం, ఒరియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ.. 2009లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని పై విచరాణ చేపట్టిన హైకోర్టు తెలుగు భాషకు ప్రాచీన హోదా పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తన తీర్పులో పేర్కొంది.