అనుష్క ఉదారత | Anushka reduces her salary | Sakshi
Sakshi News home page

అనుష్క ఉదారత

Published Mon, Mar 9 2015 10:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

అనుష్క ఉదారత

అనుష్క ఉదారత

సినిమా అనేదే జంతర్ మంతర్. ఇక తారల మాటలు ఉల్టాపల్టీలు అంటుంటారు. 99 శాతం మంది మాటలకు చేతలకు పొంతన ఉండదనే వారు లేకపోలేదు. నటీనటులు చాలామంది అనే మాటలు పారితోషికానికి ప్రాధాన్యతనివ్వ ను. పారితోషికం లేకుండా నటిస్తాలాం టివి ఎన్నో వింటుంటాం. ఆచరణకు వచ్చేసరికి పారితోషికం అంత కావాలి, ఇంత ఇస్తేనే నటిస్తానంటూ డిమాండ్ చేస్తుంటారు. అలాంటిది నటి అనుష్క తాజా చిత్రానికి పారితోషికం చాలా తగ్గించుకుని నటిస్తున్నారన్న సమాచారం పరిశ్రమ వర్గాలకు తీయని వార్తగా మారింది.
 
  అసలు విషయంలోకి వెళితే ఇంతకుముందు ఆర్య, అనుష్కలతో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇరండాం ఉలగం ఈ చిత్రం తమిళంతోపాటు, తెలుగులోను ప్రేక్షకులను నిరాశ పరచింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థకు తీరని నష్టం కలిగిందని సమాచారం. అదే చిత్ర నిర్మాణ సంస్థ మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నూ ఆర్య, అనుష్కలే నాయికా నాయకులు విశేషం. ప్రస్తుతం అత్యధిక పారితోషికం పొందుతున్న దక్షిణాది నాయికల్లో మొదటి స్థానం అనుష్కదే. ఈ ముద్దుగుమ్మకు తెలుగు పరిశ్రమకు సమానంగా తమిళ చిత్ర పరిశ్రమలోను మార్కెట్ ఉంది.
 
  దీంతో అనుష్క సుమారు రూ.3 కోట్ల  పారితోషికం పుచ్చుకుంటోందట. తాజా చిత్రానికి తన పారితోషికాన్ని భారీగా తగ్గించుకున్నట్లు తెలిసింది. ఆమే కాదు ఆర్య కూడ తన పారితోషికాన్ని తగ్గించుకున్నారట. చిత్ర నిర్మాతల స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా అధి క పారితోషికాలను గుంజే నటీనటుల మధ్య అనుష్క, ఆర్య లాంటి ఉదార స్వభావం గల వారు ఉండడం విశేషమే కదా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement