'పవన్ విమర్శలను పట్టించుకోవద్దు'
విజయవాడ: ఏపీకి కేంద్ర ప్రకటించిన సాయాన్ని సీఎం చంద్రబాబు అర్థం చేసుకున్నట్టే.. పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక సాయాన్ని అర్థం చేసుకుంటారని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ పవన్ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే పవన్ ను కలిసి కేంద్ర సాయంపై వివరిస్తామని తెలిపారు.