ప్రేమజంట వివాహ దృశ్యం
కర్ణాటక, యశవంతపుర : చూపు లేకుండా చేసి విధి వింత నాటకం ఆడినా, ఇద్దరూ ఒక్కటై కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. బెంగళూరుకు చెందిన ఒక అంధజంట ప్రేమ పెళ్లి చేసుకుంది. వివరాలు... నగరానికి చెందిన వధువు తారాబాయి అనాథ అంధ యువతి. ఒక గార్మెంట్స్‌లో పనిచేస్తోంది. మారుతి బసప్ప సంగీత ఉపాధ్యాయుడు. ఓ వేడుకలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దీంతో రిసోర్స్ సెంటర్‌కు చెందిన మేఘనా ఆదివారం వీరి వివాహాన్ని ఘనంగా జరిపించారు. నగరానికి పలువురు ప్రముఖలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment