బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం | bus crashed young man killed | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం

Published Wed, Oct 16 2013 3:05 AM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM

bus crashed young man killed

 బెంగళూరు, న్యూస్‌లైన్:          కేఎస్ ఆర్‌టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన ఇక్కడి మల్లేశ్వరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంజునాథనగరలో గణేష్ (25) నివాసం ఉంటున్నాడు. వంట మాస్టర్ అయినే గణేశ్, మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో గాయిత్రీ నగర నుంచి ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో మరియప్పనపాళ్యలోని హరిశ్చంద్ర ఘాట్ దగ్గర డివైడర్ దాటుతున్న సమయంలో అటువైపుగా వచ్చినకేఎస్ ఆర్‌టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన గణేష్ అక్కడిక్కడే మృతి చెందాడని, బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు మల్లేశ్వరం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement