రాష్ట్రానికి వాన కబురు | Call the rain | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి వాన కబురు

Published Mon, Oct 21 2013 12:52 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

Call the rain

 =రేపు రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు
 =  నవంబర్ ఒకటి వరకు వర్షాలు

 
సాక్షి, బెంగళూరు : నైరుతి రుతుపవనాల అవధి ముగియగానే రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు అడుగుపెట్టేస్తున్నాయి. రాష్ట్ర వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈనెల 22న ఈశాన్య రుతుపవ నాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు రాష్ట్ర వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

సాధారణంగా ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడు, కేరళ ప్రాంతానికి ఎక్కువ ప్రయోజం ఉన్నా ఈసారి కర్ణాటకలో కూడా మంచి వర్షాలే పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈశాన్య రుతుపవనాల రాక ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం బెంగళూరులో మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది.

ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి  ఈనెల 22న  ప్రవేశించనుండటంతో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా  వ ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ రణ శాఖ వెల్లడించింది. మండ్య, మైసూరు, కొడగు, చామరాజనగర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉంది. ఈ  ప్రభావం నవంబర్ ఒకటి వరకు ఉంటుందని వాతావ రణ శాఖ అధికారులు తెలియజేశారు. కాగా, జూన్‌లో నైరుతి రుతుపవనాల వల్ల ఆరంభమైన ముంగారు వర్ష ప్రభావం దాదాపు ముగిసింది. దాదాపు నాలుగున్నర నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు పడిన విషయం తెలిసిందే. దీంతో రెండేళ్లుగా నెలకొన్న కరువు పరిస్థితులు తొలిగిపోయే అవకాశం ఉన్నట్లు ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement