మైసూరు: నకిలీలా మోత సమాజంలో రోజురోజుకు పెరుగుతూ పోతోంది. తినే వస్తువు నుంచి చదువు దాకా నకిలీలు ఎక్కువయ్యాయి. కష్టపడి చదివి పాస్ అయితే వచ్చే మార్కుల జాబితాలను కూడా నకిలీ రూపంలో అందిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిర నకిలీ మార్కుల జాబితాలను విక్రయిస్తున్న మహిలను నగరంలో సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గోకులంకు చెందిన యశస్విని(45) వద్ద నుంచి పోలీసులు వివిధ విద్యాలయాలకు చెందిన నకిలీ మార్క్స్కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
శనివారం మైసూరులోని నజరబాద్ లో ఉన్న పంచాయతీ కార్యాలయం వద్దకు కారులో యశస్విని వచ్చింది. అక్కడ పోలీసులను చూసి పారిపోవడానికి యత్నిచింది. దీంతో అనుమానించి సీఐ చంద్రకళ వెంబడించి సదరు మహిళను పట్టుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెల్లడించింది. వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిన మార్క్స్ కార్డులను నకిలీవి తయారు చేసి ఒక్కొక్కటి రూ. 30 నుంచి 50 వేల వరకు విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు విచారణలో పేర్కొంది. ఆమెకు సహకరిస్తున్న మరో ఇద్దరి కోసం పోలీసులుగాలిస్తున్నారు.
లేడీ కిలాడి ఎంత పని చేసింది..
Published Sun, Jul 23 2017 9:06 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM
Advertisement