సాక్షి, బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో పలువురు ప్రముఖులు, ఎన్నికల బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు, సినీ తారలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నగరంలో ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో శాండల్‌వుడ్ నటుడు రమేష్ అరవింద్ దంపతులు, తార, శృతి, రాధికా పండిట్, హర్షికా పొన్నాచ్చ, పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్న రిజ్వాన్ అర్షద్, నారాయణ స్వామి, నందినీ ఆళ్వా, బాలకృష్ణన్, పి.సి.మోహన్, నందన్ నీలేకణి, అనంతకుమార్‌తో పాటు బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు తదితరులు ఉన్నారు.
మైసూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమకూరులో సిద్ధగంగ మఠాధిపతి శ్రీ శివకుమార స్వామీజీ, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్, రామనగరలో కుమారస్వామి, బళ్లారిలో శ్రీరాములు, చిక్‌బళ్లాపురంలో వీరప్ప మొయిలీ, హుబ్లీలో ప్రహ్లాద్ జోషి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటేసిన ప్రముఖులు
Published Fri, Apr 18 2014 2:37 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement