వివేక్ ప్రశంసలందుకున్న పట్రా | comedian Vivek Acclaimed Mithun vaidehi | Sakshi
Sakshi News home page

వివేక్ ప్రశంసలందుకున్న పట్రా

Published Fri, Feb 13 2015 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

వివేక్ ప్రశంసలందుకున్న పట్రా

వివేక్ ప్రశంసలందుకున్న పట్రా

పట్రా చిత్రం ప్రముఖ హాస్యనటుడు వివేక్ ప్రశంసలు పొంది అంతా కొత్త వారితో తెరకెక్కిన చిత్రం పట్రా. జి.కె.సినిమాస్ పతాకంపై ఎ.గాంధికుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జయందాన్ దర్శకత్వం వహించారు. నవజంట మిథున్ వైదేహి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో శ్యామ్‌పాల్, పులిపాండి, ఆదేష్, రేణిగుంట గణేష్, ఉమ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సునోజ్ వేలాయుధన్ ఛాయాగ్రహణం, శ్రీకృష్ణ సంగీతాన్ని అందించిన పట్రా చిత్రాన్ని ఈ నెలాఖరుకు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు.
 
  బుధవారం సాయంత్రం విలేకరులతో దర్శకుడు జయందాన్ మాట్లాడుతూ, పట్రా అంటే ఆయుధాలను తయారు చేసే స్థలం అని తెలిపారు. చిత్రం పేరు, పోస్టర్లు చూసి కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఇదేదో హింసాత్మక సంఘటనలతో కూడిన చిత్రంగా ఉందనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. నిజానికిందులో హింసాత్మక సంఘటనలుండవన్నారు. చిత్ర నిర్మాత గాంధికుమార్ మాట్లాడుతూ దర్శకుడు జయందాన్ తనకు బాల్యమిత్రుడని తెలిపారు. తనను ప్రోత్సహించడానికే తానీ చిత్రం నిర్మించినట్లు తెలిపారు. చిత్రం చాలా సంతృప్తికరంగా వచ్చిందని చిత్ర టైటిల్, పోస్టర్లు, ప్రచార చిత్రాన్ని చూసిన హాస్యనటుడు వివేక్ బాగున్నాయంటూ ప్రశంసించటం ఆనందంగా ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement