ప్రేమను పెంచే ఆహారపాత్ర.. కొత్త జంటలకు ప్రత్యేకమట! | Do You Know In The Cities Of UP Food Plates Are Prepared For Newly Wedded Couples To Eat, Know Details About It - Sakshi
Sakshi News home page

ప్రేమను పెంచే ఆహారపాత్ర.. కొత్త జంటలకు ప్రత్యేకమట!

Published Wed, Nov 15 2023 12:48 PM | Last Updated on Wed, Nov 15 2023 3:25 PM

Food Plates are Prepared for Newborn Couples to Eat - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్.. బ్రాస్ సిటీ(ఇత్తడి నగరం)గా పేరుగాంచింది. ఇక్కడి ఇత్తడి ఉత్పత్తులు మన దేశంలోని పలు ప్రాంతాలతోపాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతాయి. ఈ బ్రాస్ సిటీలో కొత్తగా పెళ్లయిన జంటల కోసం ఫుడ్ ప్లేట్లు తయారు చేస్తున్నారు. పెళ్లి తర్వాత కొత్త దంపతులు ఈ ప్లేట్‌లో ఆహారం తింటే వారి మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్లేట్లకు స్థానికంగా మంచి డిమాండ్ ఉంది. ఇత్తడి వస్తువుల వ్యాపారి సల్మాన్ మాట్లాడుతూ తాము కొత్త జంటల కోసం ఫుడ్ ప్లేట్లు సిద్ధంగా ఉంచామన్నారు. చాలామంది కంచు పాత్రలలో తినడానికి ఇష్టపడతారని, అయితే కాంస్య లోహం ఖరీదు ఎక్కువగా ఉండడంతో ఇత్తడితో ఈ ఫుడ్ ప్లేట్ సిద్ధం చేశామన్నారు. ఈ ప్లేట్లను తక్కువ ధరలకే విక్రయిస్తున్నామని తెలిపారు. ఈ పాత్రలు ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఈ ఫుడ్ ప్లేట్‌ సెట్‌లో మూడు గిన్నెలు, ఒక పుడ్డింగ్ ప్లేట్, ఒక స్పూన్, ఒక గ్లాస్, మరో ప్లేట్ ఉంటాయన్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో వీటి కొనుగోళ్లు అధికంగా ఉంటాయన్నారు. 
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ అభ్యర్థి కన్నుమూత.. 25న ఓటింగ్‌ రద్దు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement