ఫిబ్రవరిలో రాష్ట్రానికి రాహుల్ రాక | Congress general secretary Rahul Gandhi February coming Chennai | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో రాష్ట్రానికి రాహుల్ రాక

Published Tue, Jan 28 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

Congress general secretary Rahul Gandhi February coming  Chennai

 టీనగర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో రాష్ట్రానికి రానున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ తెలిపారు. ఆయన సత్యమూర్తి భవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో కళాశాల విద్యార్థుల వద్ద అవినీతికి వ్యతిరేకంగా మద్దతు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. 30న విద్యార్థి కాంగ్రెస్ తరపున జిల్లా ప్రధాన నగరాల్లో అవినీతికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 31న అవినీతికి వ్యతిరేకంగా విజ్ఞప్తులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేలకు అందజేస్తామన్నారు. ఫిబ్రవరి 4న జిల్లా స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా ధర్నా, 5న పార్లమెంటులో లోక్‌పాల్ ముసాయిదా ప్రవేశపెట్టేందుకు మద్దతు కోరుతూ చెన్నైలో ఆందోళన జరుపనున్నట్లు తెలిపారు. 12న రాష్ర్టవ్యాప్తంగా మద్య నిషేధం కోరుతూ ఆందోళన జరపనున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి చివరిలో రాష్ట్రానికి రానున్నట్లు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement