ఈసెట్ రద్దు చేయాలి: కాంగ్రెస్
Published Mon, May 8 2017 3:48 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన నిర్వహించిన ఈసెట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇంత దరిద్రంగా ఎవరు, ఎప్పుడూ నిర్వహించలేదేమోనని, అభ్యర్థులకు, తల్లిదండ్రులకు దీనిపై అనుమానాలు ఉన్నాయని పీసీసీ అధికార ప్రతినిధి మహేష్ తెలిపారు. ఆన్‌లైన్ పరీక్ష అంటూ ఆ విధానానికే మచ్చ తెచ్చేలా నిర్వహణ ఉందని తెలిపారు. ఉదయం మొదలు కావాల్సిన పరీక్ష 5 గంటల ఆలస్యంగా ప్రారంభమయిందని చెప్పారు. విద్యా వ్యవస్థ, పరీక్ష వ్యవస్థ మీద నమ్మకం పోయేలా ఈసెట్ జరిగిందని దుయ్యబట్టారు.
కొన్నిచోట్ల ఆఫ్‌లైన్ లో పరీక్ష నిర్వహించటం చూస్తే పేపర్ లీక్ అయందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఎంసెట్ లీకేజీ తర్వాత కూడా ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవకపోవడం ఇలాంటి సీఎం ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రికి తెలియకుండా టెండర్ ప్రక్రియ.. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తనకు నచ్చిన సంస్థకు ఇచ్చేశారని చెప్పారు. ఎంసెట్ లీకేజీ నుంచి పాపిరెడ్డి తప్పించు కున్నారు. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. ప్రభుత్వం తీరు సరిగా లేదని అనేక సార్లు చెప్పినా కూడా.. ఇంత ఘోరంగా పరీక్ష నిర్వహించినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
Advertisement
Advertisement