తల్లి లేని నన్ను కాపాడు నాన్నా.. | daughter dharna in front of father house in c district | Sakshi
Sakshi News home page

తల్లి లేని నన్ను కాపాడు నాన్నా..

Published Mon, Oct 3 2016 11:37 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

తల్లి లేని నన్ను కాపాడు నాన్నా..

తల్లి లేని నన్ను కాపాడు నాన్నా..

తండ్రి ఇంటి ఎదుట కూతురి దీక్ష

ములకలపల్లి: ‘నాన్నా..! తల్లి లేని నన్ను కాపాడు. నువ్వు ఆదరించకపోతే మరణమే దిక్కు. నన్ను కాపాడే వరకు మంచినీళ్లు కూడా తాగను. నీ కాళ్లు మొక్కుతా నాన్నా.. ఇట్లు.. నీ కూతురు దీపిక’ అని ఫ్లెక్సీ పెట్టి ఓ కూతురు తన తండ్రి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం పంచాయతీ పరిధి సుబ్బనపల్లి లో ఆదివారం జరిగింది.

గ్రామానికి చెందిన తాటిపల్లి రామచంద్రయ్య ఒడ్డురామవరానికి చెందిన గుగులోత్‌ శారదను 15 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఓ పాప (దీపిక) జన్మించింది. పాపకు నాలుగేళ్ల వయసున్నప్పుడు శారద అనారోగ్యంతో మృతిచెం దింది. అనంతరం దీపికను వాళ్ల అమ్మమ్మ ఇం ట్లో వదిలేసి రాంచంద్రయ్య మరో మహిళను వివాహం చేసుకున్నాడు.

కాగా, దీపికకు థైరాయిడ్‌ ఉందని, ఆపరేషన్‌కు రూ.50 వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఇన్నాళ్లు బాగోగులు చూసిన అమ్మమ్మ వృద్ధురాలు కావడం తో తనకు భోజనం పెట్టడమే కష్టంగా మారిం దని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. పలుమార్లు గ్రామపెద్దలను ఆశ్రయించి తనను ఆదుకోవాలని వేడుకున్నప్పటికీ ఫలితం లేకుం డా పోయిందని తెలిపింది. కాగా, జగదాంబ గిరిజన సేవా సంఘం దీపికకు సంఘీభావం ప్రకటించారు. దీపికను తండ్రి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement