న్యూఢిల్లీ: మెడికల్ రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విపిన్‌శర్మ అత్యధికంగా రూ. 1.32 కోట్లు, బీజేపీ ఎమ్మెల్యే అత్యంత తక్కువగా రూ. 8,182 పొందారు. ఇదిలాఉంచితే ఆయా ఎమ్మెల్యేల ప్రయాణ బిల్లులు కూడా ఏమీ తక్కువగా లేవు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో బీజేపీ ఎమ్మెల్యే షకూర్ బస్తీ శ్యామ్‌లాల్‌గార్గ్ రూ. 3.87 లక్షలు పొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజౌరీ గార్డెన్ ఎంపీ ఎ.దయానంద్ చండీలియా రూ. 17,682 పొందారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద సుభాష్ అగర్వాల్ అనే ఓ సామాజిక కార్యకర్త దరఖాస్తు చేయడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకొచ్చాయి. ఇదిలాఉండగా మెడిక్లెయిమ్ కింద కాంగ్రెస్ ఎమ్మెల్యే విపిన్‌శర్మ రూ. 1.32 కోట్లు పొందగా, ఆయనతోపాటు నజఫ్‌గఢ్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే భరత్‌సింగ్ రూ. 2.75 లక్షలు, హరినగర్ ఎమ్మెల్యే హరిశరణ్ సింగ్ బల్లీ రూ. 17.4 లక్షలు పొందారు.