సాక్షి, న్యూఢిల్లీ : విధానసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ 24 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. గత విధానసభ ఎన్నికలలో గెలిచిన ఎనిమిది మందితో పాటు ఇటీవల పార్టీలో చేరిన షోయబ్ ఇక్బాల్‌కు కూడా టికెట్ లభించింది. అదేవిధంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు ఎ.కె.వాలియా, రాజ్‌కుమార్ చౌహాన్‌లకు టికెట్లు దక్కాయి. అయితే పరాజయం పాలైన స్పీకర్ యోగానందశాస్త్రికి మాత్రం టికెట్ ఇవ్వలేదు.
డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీకి గాంధీనగర్, మరో మాజీ మంత్రి హరూన్ యూసఫ్‌కు బల్లీమారన్ టికెట్ ఇచ్చింది. వీరిద్దరు గత విధానసభ ఎన్నికలలో కూడా ఈ స్థానాలనుంచి గె లుపొందారు. గత ఎన్నికలలో లక్ష్మీనగర్ నియోజకవర్గంలో ఓటమి పాలై రెండోస్థానంలో నిలిచిన ఎ.కె.వాలియాకు మళ్లీ అదే సీటు నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు.
మంగోల్‌పురిలో ఓడిపోయిన రాజ్‌కుమార్ చౌహాన్ కూడా మళ్లీ అదే నియోజకవర్గం బరిలోకి దిగుతారని ఆ పార్టీ ప్రకటించింది. ఇటీవల జేడీయూనుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్‌ను మతియా మహల్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మకు ఉత్తంనగర్ టికెట్ ఇచ్చారు, చౌదరీ మతీన్ అహ్మద్‌కు సీలంపుర్ టికెట్ లభించింది.
అభ్యర్థులు వీరే...
1. బాద్లీ: దేవేంద్రయాదవ్,
2. బవానా (షె.కు):
సురేందర్‌కుమార్
3. సుల్తాన్‌పుర్ మాజ్రా(షె.కు):
జైకిషన్
4. నాంగ్లోయ్ జాట్:
డా. బిజేందర్‌సింగ్
5. మంగోల్‌పురి (షె.కు):
రాజ్‌కుమార్ చౌహాన్
6. చాందినీచౌక్: ప్రహ్లాద్ సహానీ
7. మతియామహల్:
షోయబ్ ఇక్బాల్
8. బల్లీమారన్: హరూన్‌యూసఫ్
9. రాజోరీగార్డెన్: ధన్వంత్రీ
చండేలా
10. గాంధీనగర్: అర్విందర్ సింగ్
లవ్లీ
11. ఉత్తంనగర్: ముఖేష్ శర్మ
12: జంగ్‌పురా: తర్విందర్ మార్వా
13. మెహ్రోలీ :సత్బీర్‌సింగ్
14: ఛత్తర్ పూర్: బల్‌రామ్ తన్వర్
15. సీలంపురి: మతీన్ అహ్మద్
16: కల్కాజీ: సుభాష్ చోప్రా
17. తుగ్లకాబాద్: సచిన్ బిదూరీ
18: బదర్‌పూర్: రామ్‌గోపాల్
నేతాజీ
19. ఓఖ్లా: ఆసిఫ్ మహ్మద్ ఖాన్
20. లక్ష్మీనగర్: డా. ఎ.కె.వాలియా
21. విశ్వాస్‌నగర్: నసీబ్ సింగ్
22. షహదరా: డా. నరేంద్రనాథ్
23. ఘోండా: భీషం శర్మ
24. ముస్తఫాబాద్ : హసన్ అహ్మద్
కాంగ్రెస్ తొలి జాబితా ఇదే
Published Fri, Jan 2 2015 12:24 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement