న్యూఢిల్లీ: నగరంలోని రాజ్‌పథ్‌కు వెళ్లే ప్రధాన రోడ్లన్నీ శుక్రవారం ఉదయం మూసివేస్తారు. సాధారణ ట్రాఫిక్‌పై నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. ఎందుకంటే.. సర్దార్ వల్లభబాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ నుంచి ‘రన్‌ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి రాజ్‌పథ్, రఫీ మార్గాల్లో ఉదయం 5.30 గంటల నుంచి 9.30 వరకు, జనపథ్-మాన్‌సింగ్ మార్గాల్లో 7.00 గంటల నుంచి 9.30 వరకు జనరల్ ట్రాఫిక్ నిషేధం ఉంటుందని స్పెషల్ కమిషనర్(ట్రాఫిక్) ముక్తేశ్ చందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది కార్లు, బస్సుల్లో పాల్గొంటారని పోలీసులు తెలిపారు. వీరితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఆయా రోడ్లపై వాహనాల నిషేధాజ్ఞలను పాటించాలని వాహనదారులను కోరారు. ఈ అసౌకర్యాన్ని మన్నించాలని కోరారు.
రేపు రాజపథ్ రోడ్డులో ట్రాఫిక్ నిషేధం
Published Wed, Oct 29 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM
Advertisement
Advertisement