డీయూలో ‘క్లీన్ ఇండియా’ | Delhi University ropes in Municipal Corporation of Delhi for cleanliness campaign | Sakshi
Sakshi News home page

డీయూలో ‘క్లీన్ ఇండియా’

Published Tue, Sep 30 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

Delhi University ropes in Municipal Corporation of Delhi for cleanliness campaign

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోదీ ‘ క్లీన్ ఇండియా’ పిలుపునకు ఢీల్లీ యూనివర్సిటీ(డీయూ) స్పందించింది. డీయూలో పారిశద్ధ్యం- ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులల్లో అవగాహన కల్పించడానికి 20 మంది సభ్యులతో కూడిన   స్వచ్ఛ భారత్ అభియాన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వర్సిటీ  ప్రాంగణంలో పారిశుద్ధ్య పనితీరును పర్యవేక్షిస్తుంది.  క్యాంపస్‌లో ఈ స్పెషల్ డ్రైవ్ ఒక్కరోజుతోనే పరిమితం కాదు, 2019 వరకూ నిరంతరం కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీ గాంధీ జయంతిన ప్రారంభించి, 150వ గాంధీ వర్ధంతి వరకూ నిరంతరం నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
 
 ప్రణాళిక రూపొందించాం
 క్యాంపస్ ప్రాంగణాన్ని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించామని డీయూ మీడియా కో ఆర్డినేటర్,  జాయింట్ డీన్ మాలే నీరవ్ చెప్పారు.  డీయూ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది క్యాంపస్‌లో పారిశుద్ధ్య పరిరక్షణలో భాగస్వాములు అవుతారు. వీరితో కలిసి పనిచేయడానికి ఎంసీడీ కూడా పారిశద్ధ్య కార్మికులను నియమిస్తుంది. 2015, 2017, 2019 వరకు మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. యూనివర్సిటీ అధికారుల నేతృత్వంలో వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ ఆయా కాలేజీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
 
 గాంధీ జయంతి రోజు శ్రీకారం: ఇందులో భాగంగానే నగర మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ పాలుపంచుకొంటోంది.  ‘క్లీన్ ఇండియా’పై విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి శ్రీకారం చుట్టింది. ‘డీయూ స్వచ్ఛత అభియాన్’ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా వర్సిటీలోని గాంధీభవన్ వేదికగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సుమారు 100 ఎంసీడీ సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య కార్యమ్రాన్ని ప్రారంభిస్తున్నామని డీయూ సమాన అవకాశాల విభాగం డిప్యూటీ డీన్ బిపిన్ తివారి చెప్పారు. క్లీన్‌నెస్ ఆవశ్యకత-జవాబుదారీతనం గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే ధ్యేయమని చెప్పారు. క్యాంపస్‌లో పారిశుద్ధ్య కార్మికులతో పాటు డీయూ సభ్యులు పాల్గొంటారు. దక్షిణ, ఉత్తర క్యాంపస్‌లోని అన్ని విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్లు పాల్గొంటారు. క్యాంపస్ పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైస్ చాన్స్‌లర్ పిలుపు ఇస్తారని తివారి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement