న్యూఢిల్లీ:తీహార్ సెమీ ఓపెన్ కారాగారంలో రెస్టారెంట్ ఏర్పాటైంది. కారాగారం అధికారులు ఇప్పటికే కొందరు ఖైదీలకు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు నేర్పారు. ప్రస్తుతం వారితోనే వంట తదితర కార్యకలాపాలను లాంఛనంగా నిర్వహిస్తున్నారు. ఖైదీలే మున్ముందు భోజనం వడ్డించనున్నారు. ఈ రెస్టారెంట్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే దీనిని పూర్తిస్థాయిలో ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయమై తీహార్ కారాగారం ప్రజాసంబంధాల అధికారి సునీల్‌గుప్తా మాట్లాడుతూ ‘చవక ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలనేది మా లక్ష్యం. పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొందరు ఖైదీలకు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో శిక్షణ ఇచ్చాం.
దీంతో వారంతా తమ నైపుణాన్ని, ప్రతిభాపాటవాలను వినియోగిస్తూ ఇందులో పనిచేస్తున్నారు. హేయమైన నేరాలకు పాల్పడకపోవడంతోపాటు సత్పప్రవర్తన కలిగిన ఖైదీలకే ఈ కోర్సు నేర్పించామన్నారు. దీంతోపాటు మానసికంగా సరిగా ఉన్నవారినే ఇందుకు ఎంపిక చేశామని, వారికే శిక్షణ ఇచ్చి హోటల్ విధుల్లోకి తీసుకున్నామన్నారు. 12 సంవత్సరాలకంటే తక్కువ శిక్ష పడిన వారినే ఈ హోటల్ కార్యకలాపాలకు ఎంపిక చేశామన్నారు. అంతకంటే ఎక్కువ ఉన్నవారిని తీసుకోలేదన్నారు. ఈ రెస్టారెంట్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని, నాణ్యమైన ఆహారం లభిస్తుండడంతో కొనుగోలుదారుల సంఖ్య నానాటికీ పెరుగు
కుంటామన్నారు. ఈ రెస్టారెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖైదీల సంక్షేమం కోసం వినియోగిస్తామన్నారు.
ఈ రెస్టారెంట్‌లో 50 మంది కూర్చునేందుకు వెసులుబాటు ఉందన్నారు. కాగా ఈ రెస్టారెంట్ ఉదయం పది గంటలనుంచి రాత్రి పది గంటలవరకూ తెరిచేఉంటుంది. కిలోమీటర్ పరిధిలో కొనుగోలుదారులకు డె లివరీ సదుపాయం కూడా ఉంది. శిక్షణ పొందిన మహిళలు టిఫిన్‌లతోపాటు భోజనం తయారుచేస్తారన్నారు. వీటి కనీస ధర రూ. 40గా నిర్ణయించామన్నారు. దీంతోపాటు చపాతీలు కూడా తయారు చేస్తారన్నారు. నాణ్యతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. పౌష్టికాహారానికే ప్రాధాన్యమిస్తామన్నారు. మహిళలకు శిక్షణ కోసం స్థానిక లజ్‌పత్‌నగర్‌లోని ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ సంస్థ సహకారం తీసుకున్నామన్నారు. ఈ సంస్థ సభ్యులు ఇందులో పనిచేసే మహిళలకు నాణ్యమైన ఆహార పదార్థాల తయారీలో శిక్షణ ఇస్తారన్నారు.
ప్రవర్తనలో మార్పుకోసం హేపీనెస్ ప్రోగ్రాం
ఖైదీల్లో పరివర్తన కోసం తీహార్ కారాగారం అధికారులు సరికొత్త యోచన చేశారు. ఇందుకోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహకారం తీసుకుని శిక్షణా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఢిల్లీ కారాగార విభాగం డెరైక్టర్ జనరల్ విమలా మెహ్రా వెల్లడించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ శిక్షణ కార్యక్రమానికి సమ్మతించిందన్నారు. ఆధ్యాత్మిక గురువులతో ఖైదీలకు ప్రవచనాలు కూడా బోధింపజేస్తామన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమానికి ఖైదీలను సన్నద్ధం చేయాల్సిందిగా కారాగార విభాగం సూపరింటెండెంట్‌ను ఆదేశించామన్నారు. మరోసారి నేరాలపై వీరి మనసు మరలకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. అదేవిధంగా నేరాలు చేయాలంటూ ఇతరులను వీరు ప్రేరేపించకుండా చేయడంపైకూడా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఎయిమ్స్‌కు చెందిన సైక్రియాటిస్టులు కూడా హాజరవుతారన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కూడా ఇదేవిధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో కలసి ఖైదీల్లో మానసిక పరివర్తన కోసం కౌన్సిలింగ్ తదితర కార్యక్రమాలను కూడా పెద్దఎత్తున నిర్వహించామని ఆయన మీడియాకు వివరించారు.
‘తీహార్’లో రెస్టారెంట్
Published Sun, Jul 13 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM
Advertisement
Advertisement