డెంకణీకోటలో ఏనుగుల గుంపు | Denkani group of elephants in the castle | Sakshi
Sakshi News home page

డెంకణీకోటలో ఏనుగుల గుంపు

Published Sun, Jan 11 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

డెంకణీకోటలో ఏనుగుల గుంపు

డెంకణీకోటలో ఏనుగుల గుంపు

పారదోలడానికి ప్రత్యేక బృందాలు

హొసూరు: డెంకణీకోట అటవీ ప్రాంతం లో వంద ఏనుగులు మూడు గుంపులుగా విడిపోయి అటవీ ప్రాంత గ్రామాల రైతుల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. మూడు నెలలుగా ఏనుగులు హొసూరు, డెంకణీకోట తాలూకా ప్రజలకు భయాం దోళనలు కల్పిస్తున్నాయి. ఏనుగులను తరిమేందుకు అటవీ శాఖ అధికారులు ఎంతగానో ప్రయత్నించి, విఫలమయ్యా రు. కొద్ది రోజుల క్రితం హొసూరు తాలూ కా శ్యానమావు, పోడూరు, కామనదొడ్డి, రామాపురం, బీర్జేపల్లి తదితర ప్రాంతంలోని అడవిలో మకాం వేసిన ఏనుగులను అటవీ శాఖ అధికారులు డెంకణీకోట తాలూకా రాయకోట సమీపంలోని ఊడేదుర్గం అటవీ ప్రాంతానికి తరిమికొట్టా రు. శుక్రవారం రాత్రి అటవీ శాఖ ఉద్యోగుల తీవ్ర ప్రయత్నంతో డెంకణీకోట సమీపంలోని బేవనత్తం అటవీ ప్రాంతానికి తరలించారు.

ప్రస్తుతం ఈ ప్రాంతం లో వంద ఏనుగులు చేరాయి. అవి మూ డు గుంపులుగా విడిపోయి బేవనత్తం, మరగట్ట, తళి ప్రాంతాలలో సంచరిస్తూ అటవీ ప్రాంత గ్రామాల రైతులను భ యాందోళనలకు గురిచేస్తూ పంటపొలాల ను ధ్వంసం చేస్తున్నాయి. ఈ సంఘటన పై అటవీ శాఖ అధికార్లు చర్యలు తీసుకుని 40 మందితో ఏనుగులను కర్ణాటక రాష్ట్రం బన్నేరుగట్ట అటవీ ప్రాంతానికి తరిమేందుకు ప్రయత్నాలు చేపడుతున్నా రు. అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు ఇత ర గ్రామాల వద్దకు కూలిపని, ఉద్యోగం తదితర పనులకెళ్లిన వారు ఏనుగుల భయంతో సాయంత్రం గ్రామాలకు చేరుకోలేక భయాందోళనకు గురవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement