విభజన పాపం కాంగ్రెస్,టీడీపీ,బీజేపీదే | Division I, Congress, TDP, bijepide | Sakshi
Sakshi News home page

విభజన పాపం కాంగ్రెస్,టీడీపీ,బీజేపీదే

Published Sun, May 4 2014 3:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

Division I, Congress, TDP, bijepide

బెంగళూరు,న్యూస్‌లైన్ : కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వల్లే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని, సార్వత్రిక ఎన్నికల్లో ఆ మూడు పార్టీలకు బుద్ధి చెప్పి వైఎస్సార్‌సీపీని గెలిపించాలని  కర్ణాటక డాక్టర్ వైఎస్‌ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.భక్తవత్సలరెడ్డి ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. బొమ్మనహళ్లి నియోజకవర్గంలోని సింగసంద్ర, బేగూరు, వంగసంద్ర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న  కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల ప్రవాసాంధ్రులతో కలిసి ఆయన వైఎస్సార్‌సీపీ తరఫున  ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉన్న తెలుగు ప్రజలను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ విభజించగా  తెలుగుదేశం పార్టీ తన సహకారాన్ని అందించిందని మండిపడ్డారు. సీమాంధ్రలో చంద్రబాబు సభలకు ఆదరణ కొరవడిందన్నారు. ప్రజల్లో వైఎస్‌ఆర్‌సీపీకి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు  బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు.  సీమాంధ్ర అభివృద్ధి, వైఎస్ అమలు చేసిన ఫీజురీయింబర్‌‌సమెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం లాంటి పథకాల అమలు వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. ఈనెల7న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి చేశారు.  
 
కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి కొండాదామోదర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ బత్తుల అరుణాదాస్, కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సభ్యుడు ఎస్.రాజశేఖర్‌రెడ్డి, ప్రవాసాంధ్రులు రామచంద్ర, గంగాధర, రఘు, వెంకటేశ్, కేశవరెడ్డి, మంజు, హరి, ఆంజనేయులు, వీ.జయచంద్ర, గట్టురామచంద్రారెడ్డి, ఎస్.రాజారెడ్డి, ఎం.ప్రభాకరరెడ్డి, వీ.రామకృష్ణారెడ్డి,టీ.రామకృష్ణారెడ్డి, ఎఎస్.వెంకటప్ప, ఎన్.గోవిందరెడ్డి, వెంకటరెడ్డి, కుల్లాయప్ప, లోకనాథరెడ్డి, కే.రామ్మోహన్, కృష్ణప్ప, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. వివరాలకు  కే.భక్తవత్సలరెడ్డి (8880022888), బత్తుల అరుణాదాస్(9535119942), ఎస్.రాజశేఖర్‌రెడ్డి    (9448854651)సెల్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement