విఫలమైతే మరోసారి | Fails again | Sakshi
Sakshi News home page

విఫలమైతే మరోసారి

Published Thu, Jan 29 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

విఫలమైతే మరోసారి

విఫలమైతే మరోసారి

 ఒక సారి ప్రేమ విఫలమైతే, మరో సారి ఫలిస్తుందని, అంత మాత్రాన తన కొడుకుపై నేరం మోపడం సరికాదని సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు టీ రాజేందర్ అంటున్నారు. ఇంతకీ ఈయన కొడుకు ఎవ్వరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్‌లో మిస్టర్ రోమియోగా పేరున్న శింబు నయన తారల ఘాటు ప్రేమ గురించి ప్రత్యేకంగా మళ్లీ వివరించాల్సిన అవసరం లేదు. అయితే, ఆప్రేమ పెళ్లికి దారి తీయలేదు. అదే విధంగా ఆ తర్వాత హన్సికతో ప్రేమ కూడా పటాపంచలైంది.
 
 ఇలా రెండు సార్లు ప్రేమలో ఓడిన శింబు, ఇటీవల మన శ్శాంతి కోసం హిమాలయాల బాట పట్టాడు. గత ఏడాదిన్నరగా శింబు నటించిన చిత్రాలు ఏవీ తెరపైకి రాలేదు. అయితే, మాజీ ప్రేమికురాలు నయన తార, హన్సికతో నటించిన ఇదు నమ్మ ఆలు, వాలు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. శింబు, నయన తారల లవ్ బ్రేకప్ అయిన తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ఇదు నమ్మ ఆలు.
 
 ఈ చిత్రం కోసం నయన తారకు అధిక పారితోషికాన్ని సైతం చెల్లించినట్టునట్టు సమాచారం. ఏది ఏమైనా ఇప్పటి వరకు శింబు ప్రేమ వ్యవహారాల గురించి మౌనం వహిస్తున్న ఆయన తండ్రి రాజేందర్ ఎట్టకేలకు నోరు విప్పారు. తన కొడుకుని సమర్థిస్తూ మాట్లాడటం విశేషం. శింబు యువకుడు. యుక్త వయస్సులో ప్రేమ పుట్టడం సహజం. అయితే, ఓ సారి ప్రేమలో విఫలమైన పక్షంలో మళ్లీ కొంత కాలం తర్వాత ప్రేమ పుడుతుంది. ఇది లోకం రీతి. అయినా, శింబును నేరస్తుడుగా చూస్తున్నారన్నారు. నిజం చెప్పాలంటే, శింబు చాలా సిన్సియర్. చిన్న వయస్సులోనే ఎంతో ప్రతిభను చాటుకున్నారు. అలాంటి వాడు తన కుమారుడు కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement