శింబుకు షాక్ ఇచ్చిన హన్సిక | No Call sheet for Simbu's 'Vaalu' says Hansika | Sakshi
Sakshi News home page

శింబుకు షాక్ ఇచ్చిన హన్సిక

Published Wed, Sep 17 2014 1:17 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

శింబుకు షాక్ ఇచ్చిన హన్సిక - Sakshi

శింబుకు షాక్ ఇచ్చిన హన్సిక

 మాజీ ప్రేమికుడు శింబుకు నటి హన్సిక షాక్ ఇచ్చింది. వీరిద్దరు వేట్టై మన్నన్ , వేలు చిత్రాల్లో హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ సమయంలోనే ఈ క్రేజీ జంట మధ్య ప్రేమ పెటాకులైన సంగతి తెలిసిందే. అయితే శింబు, హన్సికల లవ్ బ్రేకప్ అయిన తరువాత కూడా హన్సిక వాలు చిత్రంలో శింబుతో కలిసి నటించింది. అయినా ఆ చిత్రం షూటింగ్ పూర్తి కాలేదు. ఇప్పుడా చిత్రానికి సమస్యలొచ్చాయి. శింబుతో ఇకపై నటించను అని హన్సిక తెగేసి చెప్పేసింది. ప్రకటన చేస్తూ వాలు చిత్రం కోసం 64 రోజుల కాల్‌షీట్స్ అడిగారని చెప్పింది. వారికిచ్చిన కాల్‌షీట్స్‌లో తాను నటించానని అంది.
 
 ఆ తరువాత మరో 20 రోజులు అడిగారని తెలిపింది. చిత్రం పూర్తి కావాలన్న ఉద్దేశంతో ఆ 20రోజులు నటించానని చెప్పింది. మళ్లీ ఇప్పుడు ఒక పాట చిత్రీకరించాలి, మరో మూడు రోజుల కాల్‌షీట్స్ కావాలని అంటున్నారని తెలిపింది. తాను తెలుగు చిత్రం పవర్ ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నా, నూతన దర్శకుడు రావడంతో ఈ నెల 7, 8, 9 తేదీలను వాలు చిత్రం కోసం కేటాయించానని చెప్పింది. అయితే ఆ కాల్‌షీట్స్‌ను వారు సద్వినియోగం చేసుకోలేదని అంది. ఇకపై వాలు చిత్రం కోసం కాల్‌షీట్స్ కేటాయించేది లేదు. ఆ చిత్రంలో నటించేదీ లేదని హన్సిక తెగేసి చెప్పేసింది. దీంతో ఇప్పటికే పలు కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరిగినా వాలు చిత్రం తాజాగా హన్సిక ప్రకటనతో మరింత చిక్కుల్లో పడినట్లయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement