బావిలో పడి కౌలు రైతు మృతి | farmer dies after fall into well | Sakshi
Sakshi News home page

బావిలో పడి కౌలు రైతు మృతి

Published Tue, Dec 27 2016 4:38 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

farmer dies after fall into well

దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామంలో ఓ కౌలు రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. అన్న రవి అనే రైతు ఎకరంన్నర పొలం కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. పొలంలోని బావిలో మోటరు చెడిపోవడంతో మోటరును మరమ్మతు చేయించి లోపలికి దింపాడు. పైనున్న పైపును బావిలో వేయబోగా దానితోపాటే అతనూ బావిలోకి పడిపోయాడు. గట్టునున్న మరో వ్యక్తి అతడిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇతని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement