
అమ్మకు రజనీకాంత్ కుటుంబం నివాళి
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించారు. జయలలిత పార్థివదేహం ఉంచిన చెన్నైలోని రాజాజీ పబ్లిక్ హాల్‌కు రజనీ తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. రజనీ వెంట భార్య లత, అల్లుడు ధనుష్, కుమార్తెలు ఉన్నారు.
జయలలిత భౌతికకాయానికి నివాళులు అర్పించిన రజనీ.. ఆమె నెచ్చెలి శశికళను పరామర్శించారు. రజనీ కటుంబ సభ్యులు కూడా శశికళను ఓదార్చారు. జయలలిత పార్థివదేహం పక్కన ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో రజనీకాంత్ కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆరాధ్య నాయకురాలు అమ్మను చివరిసారి చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. కన్నీటి వీడ్కోలు పలికేందుకు లక్షలాది జనం రాజాజీ హాల్ కు వస్తున్నారు.