విదేశీ టేకు పట్టివేత
Published Tue, Nov 1 2016 11:22 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
ఒంగోలు క్రైం: అక్రమంగా విదేశీ టేకు తరలిస్తున్న రెండు లారీలను ప్రకాశం జిల్లాలో సోమవారం అర్థరాత్రి అటవీ శాఖ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు విదేశీ టేకు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గుంటూరుకు చెందిన స్క్వాడ్ రేంజర్ నాగేంద్రరావు ఆధ్వర్యంలోని బందం ఒంగోలు బైపాస్ రోడ్డులో మాటు వేశారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న టేకును చెన్నై హార్బర్ నుంచి లారీల్లో తరలిస్తున్నారనే సమాచారంతో టీఎన్ 18 కె 3745, ఏపి 29 టిబి 1177 నంబర్లు గల లారీలను తనిఖీ చేశారు. డ్రైవర్లను టేకుకు సంబంధించిన ఇన్‌వాయిస్, సరుకు వివరాలు చూపించాలని కోరగా.. ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో లారీలను ఒంగోలు రెగ్యులర్ ఫారెస్ట్ రేంజర్ కార్యాలయానికి తరలించారు. వాటిని ఒంగోలు అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
Advertisement