మహిళలకు ఉచిత చీరల పంపిణీ
పళ్లిపట్టు: ఆషాఢం వేడుకలు పురస్కరించుకుని 1066 మంది మహిళలకు ఉచిత చీరలను అన్నాడీఎంకే నిర్వాహకులు పంపిణీ చేశారు. పళ్లిపట్టు తాలూకా పరిధిలోని ఆర్‌కే.పేట యూనియన్ షోళింగర్ సమీపంలోని పద్మాపురంలో ఆషాఢం వేడుకలు సందర్భంగా ఇక్కడున్న కరుమారియమ్మన్ తాయ్ ముకాం బికై అమ్మవారి ఆలయాల్లో శుక్రవా రం రాత్రి విశిష్ట వేడుకలు నిర్వహిం చారు. ముందుగా మహిళలు అమ్మవారికి పొంగళ్లు పెట్టి పూజలు నిర్వహించారు. సాయంత్రం విశిష్ట అలంకరణలో అమ్మవారిని పుర వీధుల్లో ఊరేగించారు. రాత్రి ఆషాఢం వేడుకలు, ముఖ్యమంత్రి జయలలిత 66వ జన్మదిన వేడుకలను సంయుక్తంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ఆ పార్టీ షోళింగర్ యూనియన్ అధ్యక్షుడు ఏ.ఎల్.స్వామి అధ్యక్షత వహించారు. షోళింగర్ పట్టణ పంచాయతీ అధ్యక్షుడు విజయన్ స్వాగతం పలికారు. తిరువళ్లూరు, వేలూరు జిల్లాల కార్యదర్శులు బలరామన్, ఏళుమలై పా ల్గొని 2066 పేదలకు అన్నదానం, 1066 మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. జోరువాన సైతం లెక్కచేయ క వేడుకల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వేడుకల్లో భాగం గా మాజీ చీఫ్ విప్ నర్సింహన్, మాజీ మంత్రి విల్వనాథన్, నియోజకవర్గ కార్యదర్శి వేలంజేరి చంద్రన్, యూనియన్ చైర్మన్ ఇళంగోవన్, యూనియన్ కార్యదర్శులు టీటీ.శ్రీనివాసన్ పాల్గొన్నారు.