Sarees distribution
-
చీరలతో ఓటర్లకు ఎర.. ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంట్రీతో గుట్టురట్టు!
కర్నూలు: వరుసగా రెండు సార్లు ఓటమిపాలైన తండ్రీకుమారులు.. ఈసారి గెలుపుకోసం అడ్డదారులు వెతుక్కుంటున్నారు.. చీరల మూటలు తెచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. తమ అనుచరులతో ఓటర్లను ప్రలోభ పెడుతూ రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ.. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి టీడీపీ నాయకులు దొరికిపోయారు. వీరు కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అనుచరులు కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు నెలరోజుల ముందే కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రలోభాలకు తెర లేపారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అదే ఉత్సాహంతో మూడవ సారి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. మారి్నంగ్ వాక్, ఇంటింటి ప్రచారం కార్యక్రమాలతో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ఫలాలు వివరిస్తూ ఆపార్టీ నేతలు బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం నేతల్లో సమన్వయం లేదు. తండ్రి టీజీ వెంకటేష్ ఒక పార్టీ, కుమారుడు టీజీ భరత్ మరో పారీ్టలో కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. కూటమి ఏర్పడినా ఏ రోజూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలసి తిరిగిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. టీజీ భరత్ ఒక్కరే సైకిల్ యాత్ర పేరుతో కాలనీలలో తిరుగుతున్నా స్పందన అంతంత మాత్రమే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో ప్రత్యేక మ్యానిఫెస్టో పేరుతో ఆ పార్టీ నేతలు నగర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి తండ్రీ కుమారులు ఓడిపోయారు. ఆ పారీ్టకి వెన్నుదన్నుగా ఉన్న లక్కీ–2 కుటుంబం కాంగ్రెస్ పారీ్టలో చేరింది. పి.జి.నరసింహులు యాదవ్ కొత్తపేట ప్రాంతంలో గతంలో కార్పొరేటర్‌గా స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా పనిచేశారు. తాజాగా వీరి కుటుంబంలోనే ఉన్న 51వ వార్డు కార్పొరేటర్ మౌనిక రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పారీ్టకి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వీరంతా టీజీ కుటుంబానికి మద్దతుగా ఉండేవారు. ఇప్పుడు వీరంతా వెంట లేరు. పారీ్టలో నైరాశ్యం ఉంది. జోష్ లేదు. ఏలాగైన గెలవాలన్న ఉద్దేశంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇక్కడ టీజీ భరత్ ప్రయత్నాలు చేస్తున్నారు. చీరలతో ఓటర్లకు ఎర.. తమ ప్రభుత్వ హయంలో ఫలానా పనులు చేశాం. ఓట్లు వేయండి అని చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. నగరంలోని ఎర్రబురుజు వద్ద కార్యకర్తలను కొంతమందిని నియమించి పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సమీపంలోని విక్టరీ థియేటర్లో చీరల మూటలు దాచారు. ఎర్రబురుజు, బొంగుల బజార్, నెహ్రూరోడ్డు, మించిన్ బజార్ వంటి కాలనీలలో ముందుగానే స్థానిక తెలుగుదేశం నాయకులు ఓటర్లకు స్లిప్పులు పంచారు. ఒకేసారి అందరూ వెళ్లకుండా పక్కాగా ప్రణాళిక ప్రకారం చీరల పంపిణీకి రంగం సిద్దం చేశారు. గుట్టుగా ఎర వేసి ఓట్లు కొల్లగొట్టేందుకు చేసిన టీడీపీ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఓటర్లకు పంపిణీ చేసేందుకు టీడీపీ వారు దాచిన చీరల మూటలు సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు.. కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కమిషన్ నియమించిన ఫ్ల్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో విక్టరీ థియేటర్లో తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో మూటల మాటున దాచిన చీరలు బయట పడ్డాయి. మొత్తం 975 చీరలు స్వాదీనం చేసుకున్నారు. ఒక్కొక్క చీర రూ.200 ప్రకారం ఉన్నట్లు గుర్తించిన అ«ధికారులు దాదాపు రూ.2 లక్షలు విలువ చేసే చీరలను సీజ్ చేసి నగరపాలక కార్యాలయానికి తరలించారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు రిటరి్నంగ్ అధికారి భార్గవ్‌తేజ వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తన నియామావళిని తప్పకుండా పాటించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే తాను గెలిస్తే ఇది చేస్తా.. అది చేస్తా అని చెప్పుకునేందుకు ఏమీ లేక తాయిలాలు నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని పలువురు విమర్శిస్తున్నారు. తాగినోళ్లకు తాగినంత.. గత ఆదివారం.. ఓ హోటల్ కేంద్రంగా టీజీ భరత్ విందురాజకీయం నడిచింది. అప్పటికే అందిన సమాచారం మేరకు.. సాయంత్రానికి కొన్ని కుల సంఘాల ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. కులాల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు సుమారు పది మంది కూర్చునే వెసలుబాటు కల్పించారు. సమావేశంలో తమ భవిష్యత్‌కు హామీ లభిస్తుందనుకుని అందరూ ఆత్రుతగా ఎదురుచూశారు. ఇంతలో టీజీ భరత్ వచ్చి.. అందరూ సహకరిస్తే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెనుదిరిగారు. అప్పుడు మొదలైంది.. తాగినోళ్లకు తాగినంత మందు. రాత్రి సుమారు 11 గంటల వరకు ఈ తతంగం నడిచింది. అంతేకాదు.. తిన్నంత భోజనం కూడా ఏర్పాటు చేశారు.. ఎన్నికల సమయం కదామరి! ఏదో సమావేశం అనుకుని వచ్చిన కొందరు పెద్దలు ఇదేం పని అనుకుని నిట్టూర్చి బయటకు వెళ్లిపోగా.. మరికొందరు ఎంచక్కా విందు, మందుతో ఊగితూగుతూపోయారు. ఓ ఫంక్షన్ హాలులోనూ..? నగరంలోని సంకల్బాగ్ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో టీడీపీకి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తాయిలాలు దాచి పెట్టినట్లు సమాచారం. ఒకే చోట చీరలు, బహుమతులు దాచి పెడితే ఇబ్బందులు వస్తాయని టీజీ అనుచరులు ఈ ఫంక్షన్ హాలులో దాదాపు 30 వేల నుంచి 50 వేల దాకా చీరలు దాచి ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఎన్నికల పర్యవేక్షణ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది విక్టరీ థియేటర్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న చీరలను పెద్ద సంఖ్యలో స్వా«దీనం చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. కుల సంఘాలకు ఎర.. కులాల వారీగా నాయకులను ఎన్నికల వేళ ప్రలోభపెట్టేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీగా తాయిలాలు ప్రకటించడమే కాక ముఖ్యమైన వారికి విందులు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. భరత్ వార్డుల వారీగా కొంతమందిని చేరదీసి వార్డుల్లో ఇంటింటికీ డబ్బులు పంపిణీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. తనకు అనుకూలంగా ఉన్న వార్డుల్లోని ముఖ్యులను పిలిపించుకొని ప్రాంతాల వారీగా ఓటర్లను గుర్తించి కానుకలు పంపిణీ చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఇవి చదవండి: వీళ్లా.. అభ్యర్థులు! -
30 రంగులు.. 240 డిజైన్లు.. కోటీ 18 లక్షల బతుకమ్మ చీరలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పంపిణీ చేసేందుకు కోటికి పైగా చీరలు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ అవతరణ తర్వాత ప్రభుత్వమే మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలను తీరొక్క రంగుల్లో సిద్ధం చేసి ఉంచినట్లు రాష్ట్ర చేనేత శాఖ తెలిపింది. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో నేయించిన చీరలను రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మహిళలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, చీరల కోసం ఈ ఏడాది రూ.340 కోట్లను వెచ్చించినట్లు తెలంగాణ హ్యాండ్లూమ్ శాఖ తెలిపింది. 30 రంగుల్లో, 240 పైచిలుకు వెరైటీ డిజైన్లతో పాటు 800 కలర్ కాంబినేషన్లతో తయారు చేయించి పంపిణీకి సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు వెండి, బంగారు, జరీ అంచులతో చేయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఒక కోటీ 18 లక్షల చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఇదీ చదవండి: దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేతకే నా సపోర్ట్: మాజీ సీఎం కుమారస్వామి -
శారీ బ్యాంక్!
ఒకసారి కట్టిన చీరను మరోసారి కట్టుకోవడానికి ఇష్టపడరు చాలా మంది. దీంతో కొత్త చీరలు కొనే కొద్దీ పాత చీరలు కుప్పలు కుప్పలుగా బీరువాల్లో్ల మూలుగుతుంటాయి. వాటిని ఏళ్ల తరబడి కట్టకుండా అలాగే ఉంచెయ్యడం వల్ల ఎలుకలు కొట్టి కొన్ని, చెదలు పట్టి ఇంకొన్నీ చిరిగిపోవడం, అసలు కట్టకుండా మడతల్లోనే ఉండడం వల్ల చీకిపోయి మసి బట్టకు కూడా పనికి రాకుండా పోతాయి. ఇలా వృథాగా పోతున్న చీరలను నిరుపేదలకు అందించి ఉపయోగకరంగా మారుస్తోంది ఆర్తి శ్యామల్ జోషి. ఔరంగాబాద్‌కు చెందిన డాక్టర్ ఆర్తి శ్యామల్ జోషి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తోంది. రోజూ కట్టుకునే చీరలు కాకుండా ఇంట్లో పాడైపోకుండా ఉన్న చీరలు చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుత ట్రెండ్‌కు అవి నప్పవని కట్టుకోకుండా నెలల తరబడి అలానే ఉంచేసింది. అవి చూసిన ప్రతిసారి వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తుండేది ఆర్తి. ఒకరోజు నిరుపేద మహిళలకు ఇవి ఇస్తే వారికి ఉపయోగపడతాయి కదా! అనిపించింది ఆర్తికి. అనుకున్న వెంటనే తన దగ్గర ఉన్న చీరలను పంచడం ప్రారంభించింది. చీరలు తీసుకున్న మహిళలు ఎంతో సంతోషంగా ఆమెకు కృతజ్ఞతలు చెప్పడంతో ఆర్తికి ప్రోత్సాహం లభించినట్లయింది. దీంతో ఇంట్లో తను కట్టని చీరలు మొత్తం పేదలకు ఇచ్చేసింది. ఆర్తి పనిచేసే చోట చక్కగా ఉన్న కొన్ని బట్టలు, చీరలు చెత్త డబ్బాలో వేయడం గమనించింది. ఇవన్నీ వృథాగా పోతున్నాయి. వీటిని కట్టుకునే నిరుపేదలకు ఇస్తే వేస్ట్ కావు కదా... అనిపించింది. దీంతో 2016లో ఆస్థాజనవికాస్ అనే ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ‘శారీబ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఈ బ్యాంక్ ద్వారా ఆసక్తి ఉన్న మహిళల దగ్గర నుంచి చీరలు సేకరించి ఇప్పటి దాకా పాతికవేలకు పైగా చీరలను పంచిపెట్టింది. చీరలు పంచిపెట్టడం గురించి తెలిసి చాలామంది మహిళలు ఇంట్లో మూలుగుతోన్న మంచి మంచి చీరలను బ్యాంక్‌కు తెచ్చి ఇచ్చేవారు. ఇలా అందరూ ఇచ్చిన చీరలేగాకుండా సోషల్ మీడియాలో శారీ బ్యాంక్ గురించి ప్రచారం కల్పించి ఇతర నగరాల నుంచి కూడా చీరలను సేకరించి పేదవారికి ఇస్తోంది. నిజంగా ప్రతి మహిళా ఇలా ఆలోచిస్తే, అటు పర్యావరణానికి హానీ కలగదు. అటు నిరుపేదలను ఆదుకున్న వారూ అవుతారు. -
తెలుగు వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
సాక్షి, చెన్నై: తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాలనను కీర్తిస్తూ ‘10 నెలల్లో పది సంవత్సరాల ప్రగతి’ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చెన్నైలోని పూనమల్లే హైరోడ్డులోని పుల్లారెడ్డిపురంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో తమిళనాడును ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతర కృషి చేస్తున్నారని ప్రశంసించారు. దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో తమిళనాడు రాష్టం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. కొంతకాలంగా తమిళనాడులో నివసిస్తూ తమిళులుగా మమేకమైన తెలుగు వారిని కొన్ని పార్టీలు, పత్రికలు, సోషల్ మీడియా కేంద్రంగా పని చేసే ఛానళ్ళు ద్వేషించడం మాత్రమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. శేషాచలం అడవుల్లో కలప దొంగల్ని ఎన్కౌంటర్ చేస్తే చెన్నైలో ఆంధ్ర సంఘం మీద దాడి చేయించారని, ఇలాంటివి పునరావృతం కాకుండా తెలుగు వారిని కాపాడుటకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చర్యలు తీసుకోవాలని కోరారు. -
12 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా 95 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బతుకమ్మ చీరల తయారీ పూర్తయిందని, అక్టోబర్ 12 నుంచి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. గురువారం సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం చీరలను పరిశీలించి మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గతేడాది జరిగిన చిన్న అసంతృప్తులను సవరించుకుని రూ.280 కోట్లతో వేగంగా చీరల తయారీ కొనసాగించామని తెలిపారు. గతేడాది సమయాభావం వల్ల కొన్ని చీరలను సూరత్ నుంచి తెప్పించామని, కానీ ఈసారి అలా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. 80 రకాల రంగులతో చీరలను తయారు చేయించామని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవు ఉండే 5లక్షల చీరలను ప్రత్యేకంగా తయారు చేయించామని పేర్కొన్నారు. ఇçప్పటివరకు ఉత్పత్తి అయిన 50 లక్షల చీరలను జిల్లాల వారీగా పంపిణీ చేయగా, మిగిలినవి అక్టోబర్ 10 నాటికి చేరతాయని తెలిపారు. 16 వేల మందికి ఉపాధి.. సిరిసిల్ల ప్రాంతంలోని చేనేత సామాజిక వర్గాల్లో్ల పేదరికం, ఆత్మహత్యలు నివారించే విధంగా సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్లో 16 వేల మంది నేత కార్మికులకు పని కల్పించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీని ద్వారా 6 నెలలుగా పది వేల కుటుంబాలు ఉపాధి పొందాయని చెప్పారు. మెప్మా, సెర్ప్ కింద స్వయం çసహాయక బృందాల్లోని మహిళా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు సంప్రదింపుల ద్వారా ఈ సారి చీరల తయారీ, డిజైన్లలో మార్పులు చేశామన్నారు. అనంతరం జౌళీశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చీరల తయారీలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించామని చెప్పారు. గడువులోగా చీరల పంపిణీ పూర్తయ్యేలా ఏర్పాటు చేశామని తెలిపారు. -
విపక్షాలది క్షుద్రరాజకీయం
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ అంటేనే ప్రకృతిని ప్రేమించే పండగని, తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో లేని పండగ ఇదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా పేదవారికి కొత్త చీరలు బహూకరించడంతోపాటు, చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చీరల పంపిణీని మొదటిసారి ప్రారంభించారని ఆయన తెలిపారు. కానీ, చీరల విషయంలో విపక్షాలు క్షుద్ర రాజకీయం చేస్తూ, ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ చీరలు కాల్చి విపక్షాలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయని ధ్వజమెత్తారు. అసలు కానుకలకు ఎలా వెల కడతారని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలన్నీ సిద్ధాంతాలు పక్కనపెట్టి సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. తెలంగాణలో ఉన్నట్టుగా విపక్షాల నీచ రాజకీయాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. చీరలు కాలిస్తే బతుకమ్మను, తెలంగాణను అవమానించినట్టేనని, వారు కాల్చింది చీరలను కాదని, తెలంగాణ సంస్కృతిని అని పేర్కొన్నారు. చీరలు తగలబెడితే మహిళలే ఉరికించి కొడుతారని, చీరలు కాల్చడం వెనక ఎవరున్నారో ప్రభుత్వం కచ్చితంగా తేల్చి తీరుతుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎంపీ కవితను లాగడం విపక్షాల ఉన్మాదానికి నిదర్శనమన్నారు. పేదవారు బాగుపడుతున్నారని విపక్షాలకు కడుపు మండుతోందన్నారు. కాంగ్రెస్ టీడీపీల బతుకే కుంభకోణాల బతుకని, వారికి అన్నీ కుంభకోణాల్లాగే కనిపిస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. -
మహిళలకు ఉచిత చీరల పంపిణీ
పళ్లిపట్టు: ఆషాఢం వేడుకలు పురస్కరించుకుని 1066 మంది మహిళలకు ఉచిత చీరలను అన్నాడీఎంకే నిర్వాహకులు పంపిణీ చేశారు. పళ్లిపట్టు తాలూకా పరిధిలోని ఆర్కే.పేట యూనియన్ షోళింగర్ సమీపంలోని పద్మాపురంలో ఆషాఢం వేడుకలు సందర్భంగా ఇక్కడున్న కరుమారియమ్మన్ తాయ్ ముకాం బికై అమ్మవారి ఆలయాల్లో శుక్రవా రం రాత్రి విశిష్ట వేడుకలు నిర్వహిం చారు. ముందుగా మహిళలు అమ్మవారికి పొంగళ్లు పెట్టి పూజలు నిర్వహించారు. సాయంత్రం విశిష్ట అలంకరణలో అమ్మవారిని పుర వీధుల్లో ఊరేగించారు. రాత్రి ఆషాఢం వేడుకలు, ముఖ్యమంత్రి జయలలిత 66వ జన్మదిన వేడుకలను సంయుక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆ పార్టీ షోళింగర్ యూనియన్ అధ్యక్షుడు ఏ.ఎల్.స్వామి అధ్యక్షత వహించారు. షోళింగర్ పట్టణ పంచాయతీ అధ్యక్షుడు విజయన్ స్వాగతం పలికారు. తిరువళ్లూరు, వేలూరు జిల్లాల కార్యదర్శులు బలరామన్, ఏళుమలై పా ల్గొని 2066 పేదలకు అన్నదానం, 1066 మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. జోరువాన సైతం లెక్కచేయ క వేడుకల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వేడుకల్లో భాగం గా మాజీ చీఫ్ విప్ నర్సింహన్, మాజీ మంత్రి విల్వనాథన్, నియోజకవర్గ కార్యదర్శి వేలంజేరి చంద్రన్, యూనియన్ చైర్మన్ ఇళంగోవన్, యూనియన్ కార్యదర్శులు టీటీ.శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
టీడీపీ టికెట్ నాకే వస్తుంది
బొమ్మనహాళ్, న్యూస్‌లైన్ : ‘నేను రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను.. టీడీపీ టికెట్టు నాకే వస్తుంది.. మీరంతా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి’ అని కురుబ సంఘం నాయకురాలు కేవీ ఉష పేర్కొన్నారు. సోమవారం ఆమె బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాళ్‌లో ఇంటింటికి తిరిగి మహిళలకు పసుపు, కుంకుమ, చీరలను పంపిణీ చేశారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు.. ఓటు వేయడానికి ఇప్పుడేమీ ఎన్నికలు లేవు కదా అని ఆమెను ప్రశ్నించగా.. ఆమె నవ్వుకుంటూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఉష భర్త చరణ్‌కుమార్‌రెడ్డి, కురుబ సంఘం నాయకులు హనుమంతు, యోగానంద, హనుమంతు, క్రిష్ణ మీనా పాల్గొన్నారు. అడ్డుకున్నా ఆగని చీరల పంపిణీ.. పది రోజుల క్రితం నేమకల్లు, హరేసముద్రం, ఉంతకల్లు, కురువళ్లి, చంద్రగిరి, సిద్దరాంపురంలో ఉష చీరలు పంపిణీ చేస్తుండగా, టీడీపీకి చెందిన దీపక్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే సోమవారం నుంచి ఆమె తిరిగి చీరల పంపిణీని ప్రారంభించారు. కాగా.. నియోజకవర్గ ఇన్చార్జి అయిన తనతో సంప్రదించకుండా, పార్టీలో సభ్యత్వం తీసుకోకుండా చీరలను పంపిణీ చే స్తూ.. టీడీపీకి ప్రచారం చేస్తున్న ఆమె వెనుక కొంత మంది తమ పార్టీ పెద్దలు ఉన్నారని దీపక్ రెడ్డి రగిలిపోతున్నారు. -
సంక్రాంతి కానుక
సాక్షి, చెన్నై: సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో 3.45 కోట్ల మందికి ధోవతులు, చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాటి ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆదేశించింది. సంక్రాంతి పండగ (పొంగల్)ను పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రతిఏటా కార్డుదారులకు ఉచితంగా ధోవతులు, చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి ఏటా లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతోంది. కుటుంబ కార్డుదారులతో పాటు పేదలకు వీటిని అందజేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ పండగ సందర్భంగా బియ్యం, చక్కెర లేదా బెల్లం పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది 3.45 కోట్ల మందికి వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండుగ సమీపిస్తుండడంతో వీటి ఉత్పత్తిని వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 1.52 కోట్ల ధోవతులు సిద్ధమయ్యాయి. 56 లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయి. మరో వారం, పది రోజుల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందరికీ పంపిణీ చేస్తాం ఉచిత ధోవతులు, చీరల పంపిణీ గురించి జౌళి, చే నేత శాఖ మంత్రి ఎస్.సుందరరాజ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ఏడాది అత్యధిక శాతం మందికి వీటిని పంపిణీ చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. చీరలు, ధోవతుల ఉత్పత్తికి నాణ్యమైన నూలును ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. సంక్రాంతి పర్వదినం లోపు ఆయా జిల్లాలకు, అక్కడి నుంచి మండల కేంద్రాల ద్వారా రేషన్ డీలర్లకు అందజేస్తామని తెలిపారు. పండుగ నాటికి లబ్ధిదారులందరికీ వాటిని పంపిణీ చేస్తామని చెప్పారు. చేనేత ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గత ఏడాది రూ.217 కోట్ల ఉత్పత్తి జరగ్గా, ఈ ఏడాది రూ.246 కోట్ల మేరకు ఉత్పత్తి జరిగిందని వివరించారు. తేని, కన్యాకుమారి, అరంతాంగి, ఎట్టయాపురం, కృష్ణగిరిలోని నూలు ఉత్పత్తి కర్మాగారాల్ని మరింత బలోపేతం చేయనున్నామన్నారు. వీటి అభివృద్ధికి రూ.104 కోట్లు కేటాయించామని చెప్పారు.