సాక్షి, చెన్నై: తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాలనను కీర్తిస్తూ ‘10 నెలల్లో పది సంవత్సరాల ప్రగతి’ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చెన్నైలోని పూనమల్లే హైరోడ్డులోని పుల్లారెడ్డిపురంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో తమిళనాడును ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతర కృషి చేస్తున్నారని ప్రశంసించారు. దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో తమిళనాడు రాష్టం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. కొంతకాలంగా తమిళనాడులో నివసిస్తూ తమిళులుగా మమేకమైన తెలుగు వారిని కొన్ని పార్టీలు, పత్రికలు, సోషల్ మీడియా కేంద్రంగా పని చేసే ఛానళ్ళు ద్వేషించడం మాత్రమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. శేషాచలం అడవుల్లో కలప దొంగల్ని ఎన్‌కౌంటర్ చేస్తే చెన్నైలో ఆంధ్ర సంఘం మీద దాడి చేయించారని, ఇలాంటివి పునరావృతం కాకుండా తెలుగు వారిని కాపాడుటకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment