బొమ్మనహాళ్, న్యూస్‌లైన్ : ‘నేను రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను.. టీడీపీ టికెట్టు నాకే వస్తుంది.. మీరంతా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి’ అని కురుబ సంఘం నాయకురాలు కేవీ ఉష పేర్కొన్నారు. సోమవారం ఆమె బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాళ్‌లో ఇంటింటికి తిరిగి మహిళలకు పసుపు, కుంకుమ, చీరలను పంపిణీ చేశారు.
సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు.. ఓటు వేయడానికి ఇప్పుడేమీ ఎన్నికలు లేవు కదా అని ఆమెను ప్రశ్నించగా.. ఆమె నవ్వుకుంటూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఉష భర్త చరణ్‌కుమార్‌రెడ్డి, కురుబ సంఘం నాయకులు హనుమంతు, యోగానంద, హనుమంతు, క్రిష్ణ మీనా పాల్గొన్నారు.
అడ్డుకున్నా ఆగని చీరల పంపిణీ..
పది రోజుల క్రితం నేమకల్లు, హరేసముద్రం, ఉంతకల్లు, కురువళ్లి, చంద్రగిరి, సిద్దరాంపురంలో ఉష చీరలు పంపిణీ చేస్తుండగా, టీడీపీకి చెందిన దీపక్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే సోమవారం నుంచి ఆమె తిరిగి చీరల పంపిణీని ప్రారంభించారు. కాగా.. నియోజకవర్గ ఇన్‌చార్జి అయిన తనతో సంప్రదించకుండా, పార్టీలో సభ్యత్వం తీసుకోకుండా చీరలను పంపిణీ చే స్తూ.. టీడీపీకి ప్రచారం చేస్తున్న ఆమె వెనుక కొంత మంది తమ పార్టీ పెద్దలు ఉన్నారని దీపక్ రెడ్డి రగిలిపోతున్నారు.
టీడీపీ టికెట్ నాకే వస్తుంది
Published Tue, Jan 21 2014 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement
Advertisement