సాక్షి, ముంబై: అబ్బురపరిచే సెట్టింగులు, కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలతో ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువై.. పదకొండు రోజులపాటు భక్తుల నుంచి నీరాజనాలందుకున్న గణనాథుడికి బుధవారం వీడ్కొలు పలికారు. గణపతి బొప్పా మోర్యా పుడ్చా వర్షీ లౌకర్యా.. అంటూ నిమజ్జన ఘాట్‌లకు తరలించారు. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన నిమజ్జనోత్సవాలు గురువారం సాయంత్రం వరకు కొనసాగాయి. భారీ వాహనాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేసి, అందులో గణనాథుడిని ఉంచి వీధులగుండా ఊరేగించారు. వాహనాలకు ముందు కోలాటం వంటి సంప్రదాయ నత్యాలేకుండా బ్రేక్‌డ్యాన్సులు, షేక్‌డ్యాన్సులు చేస్తూ ఊరేగింపులను ముందుకు తీసుకెళ్లారు. పిల్లలు, పెద్దలు, మహిళలు ఈ ఊరేగింపులో పెద్దఎత్తున పాల్గొన్నారు. ఠాణే, పుణేతోపాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా సాగాయని పోలీసువర్గాలు వెల్లడించాయి.
19 గంటలపాటు ఊరేగిన ‘రాజా’
వీలైనంత తక్కువ సమయంలో విగ్రహాలను నిమజ్జన ఘాట్‌లకు తరలించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేసినా అవి ఎక్కడా అమలు కాలేదు. చిన్న చిన్న మండపాల్లో కొలువైన గణనాథులను కూడా కనీసం ఏడుగంటలపాటు ఊరేగించారు. ఇక ప్రముఖ మండపాల గణనాథులను తరలించేందుకు పదిగంటలకుమించే సమయం పట్టింది. ఇక ముంబై నగరవాసుల నుంచి విశేష పూజలందుకున్న లాల్‌బాగ్ చా రాజా ఊరేగింపు 19 గంటలపాటు సాగింది. బుధవారం ప్రారంభమైన ఈ ‘రాజా’ ఊరేగింపు గురువారం ఉదయం 7.30 నిమజ్జనంతో ముగిసింది. శివారు పట్టణాలైన నవీముంబై, ఠాణేల్లో కూడా ఊరేగింపులు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. అయితే పుణేలో మాత్రం వర్షం కారణంగా కాస్త ముందుగానే ఉత్సవాలు ముగిశాయి.
చెమటోడ్చిన పోలీసులు...
ఉత్సవాలు శాంతియుతంగా ముగియడంలో పోలీసులు కీలకపాత్ర పోషించారు. మండపాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించిన రోజునుంచి నిమజ్జనం వరకు పోలీసుల కంటిమీద కునుకే కరువైంది. ఊరేగింపులు ప్రశాంతంగా సాగేందుకు పోలీసులకు హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్సార్పీఎఫ్, కార్పొరేషన్ సిబ్బంది మద్దతుగా నిలిచారు. ఇక ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ విభాగం ముందుగా చేసుకున్న ఏర్పాట్లకారణంగా నగరవాసులు కొంత ఇబ్బందిపడినా ట్రాఫిక్ పోలీసులకు సహకరించారు.
ఆకట్టుకున్న కత్రిమ జలాశయాలు..
విగ్రహాల నిమజ్జనం కారణంగా తాగునీటి జలాశయాలు కలుషితం కాకుండా ఉండేందుగాను ఏర్పాటు చేసిన కత్రిమ జలాశయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటిని ఏర్పాటు చేయడంపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. గత రెండుమూడు సంవత్సరాలుగా ఠాణే మున్సిపల్ కార్పొరేషన్, బహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని చె ప్పారు.
పదిమంది మతి
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిమజ్జనోత్సవాల్లో పదిమంది మరణించారు. అందిన వివరాల మేరకు... నాసిక్‌లోని చాంద్‌వడ్ సమీపంలోగల వేల్‌గావ్ జలాశయంలో ఇద్దరు నీటమునిగి మతి చెందగా పాల్‌ఖేడ్ జలాశయంలో మరొకరు మరణించారు. ఔరంగాబాద్ సమీపంలోని నారెగావ్ గ్రామం చెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మతిచెందారు. బీడ్ జిల్లా కేంద్రంలో జరిగిన ఉత్సవాల్లో 12 ఏళ్ల బాలుడు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. షిర్డీ సమీపంలోని గోదావరి తీరంలో విలాస్ కదం(24) నదిలో మునిగిమరణించగా జల్‌గావ్, చంద్రాపూర్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ముగ్గురు నీటమునిగి మతిచెందారు.
కొల్హాపూర్‌లో ఉద్రిక్తత...
అర్ధరాత్రి దాటాక కూడా డీజే సౌండ్ సిస్టమ్‌ను కొనసాగించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొల్హాపూర్‌లో పోలీసులకు, భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీనిని అదనుగా చేసుకొన్న కొందరు ఆకతాయిలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది పోలీసులు, వివిధ మండళ్లకు చెందిన ఆరుగురు కార్యకర్తలు గాయపడ్డారు.
పింప్రిలో..
పింప్రి, న్యూస్‌లైన్: జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పింప్రివాసులు బుధవారం వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాత్రి రెండు గంటల వరకు సాగిన ఈ వేడుకలలో సుమారు 113 మండళ్లు పాల్గొన్నాయి. పింప్రిలోని షగున్ చౌక్ వద్ద పింప్రి-చించ్‌వడ్ కార్పొరేషన్, పుణే పోలీసులు స్వాగత మండపాలను ఏర్పాటు చేసి గణేశ్ మండళ్లకు పుష్పహారాలు, శ్రీఫలాలను అందించారు. నిమజ్జన వేడుకల్లో మహిళలు డోలు వాయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా రాత్రి 10 గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పింప్రి-చించ్‌వడ్‌లో 20 నిమజ్జన ఘాట్‌లను ఏర్పాటు చేశారు. 70 మంది కార్పొరేషన్ అధికారులు, 180 మంది సిబ్బంది నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పుణేలో...
పుణేలో నిమజ్జన వేడుకలు 24 గంటలపాటు కొనసాగాయి. స్థానికంగా ప్రసిద్ధిగాంచిన దగుడు సేఠ్ హల్వాయి గణపతిని ఈ ఏడాది సూర్యోదయానికి ముందుగానే నిమజ్జనం చేయడం విశేషం. పుణే నగర మేయర్ చంచలా కోద్రే, మాజీ మేయర్ వైశాలీ బన్కర్, ఎన్సీపీకి చెందిన అంకుష్ కాకడే, మాజీ ఉప మేయర్ దీపక్ మానేకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ నత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ముందుగా కస్బాగణపతిని నిమజ్జనం చేశారు. జర్మనీ, ఇటలీ, డెన్మార్క్‌కు చెందిన విదేశీయులు తమ దేశ ప్లకార్డులతో నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు.
బోరివలిలో..
బోరివలి, న్యూస్‌లైన్: బోరివలి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిమజ్జన ఘాట్‌లు భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన నిమజ్జన ఉత్సవాలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. కొన్ని మండళ్లు ఊరేగింపులో ఎడ్ల బండ్లను కూడా ఉపయోగించాయి. యువత సంగీత నత్యాలు చేస్తూ లంబోదరుడిని సాగనంపారు. శ్రీ బాలాజీ సేవా సంస్థ భక్తులకు తాగు నీటిని అందించింది. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వై.నరసింహులు, కార్యదర్శి హనుమంతు జోగై, కోశాధికారి శ్రీను మేకల తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన నిమజ్జనోత్సవాలు
Published Thu, Sep 19 2013 11:08 PM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM
Advertisement