మూడు ఎంపీ సీట్లు ఇవ్వండి
Published Thu, Sep 12 2013 4:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
సాక్షి, ముంబై: శివ్‌శక్తి, భీం శక్తి అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రెండేళ్ల కిందట బీజేపీ, శివసేన నేతృత్వంలోని కాషాయకూటమిలో చేరిన ఆర్పీఐ అధినేత రాందాస్ అఠావ్‌లేకి అందులో ఇమడలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ రెండు పార్టీల వైఖరితో విసుగెత్తిపోయిన అఠావ్‌లే వచ్చే లోక్‌సభ, శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ ఆఖరునాటికి సీట్ల సర్దుబాటు సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని ఢిల్లీలో మంగళవారంహెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఓట్లు లభించని పక్షంలో కాషాయ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.
రాష్ట్రంలోని మొత్తం 288 శాసనసభ నియోజక వర్గాల్లో తమ పార్టీకి కనీసం ఐదు నుంచి 15 వేల వరకు ఓట్లు ఉన్నాయని అన్నారు. ఈ విషయం వారు మర్చిపోవద్దని హెచ్చరించారు. ఆర్పీఐని కాషాయ కూటమిలో కొనసాగించుకోవాలంటే శివసేన, బీజేపీ నాయకులు అక్టోబర్ ఆఖరు వరకు సీట్ల విషయంపై ఆమోదముద్ర వేయాలని, లేని పక్షంలో తాము ప్రత్యామ్నాయ మార్గంపై ఆలోచించుకోవాల్సి ఉంటుందని అన్నారు. లోక్‌సభకు చెందిన కనీసం మూడు స్థానాలు, శాసనసభకు చెందిన 30-35 స్థానాలు కచ్చితంగా ఇవ్వాలని, అదే విధంగా తనకు రాజ్యసభ సీటు కావాలని డిమాండ్ చేశారు. అఠావ్‌లే ఒత్తిడితో శివసేన, బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు విసిగెత్తిపోయారు. కాషాయకూటమి నుంచి ఆయనే స్వయంగా బయటపడితే బాగుంటుందని ఢిల్లీకి చెందిన కొందరు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
‘గత నాలుగేళ్లలో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రయోగాలు చే సి చూశారు.. ఇక పార్టీ ఎదుట ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం మిగలలేదు కదా..’ అన్న ప్రశ్నకు రాందాస్ సమాధానమిస్తూ బయటపడితే అదే మార్గం దొరుకుతుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు కాషాయకూటమి దక్షిణ మధ్య ముంబై, కల్యాణ్, పుణే, సాతారా, లాతూర్, రామ్‌టెక్ నియోజకవర్గాల్లో మూడింటిని తమకు వదిలేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శాసనసభ ఎన్నికలకు తమ పార్టీ అధ్యయనం చేసిన 61 నియోజకవర్గాలలో 30-35 స్థానాలను ఇవ్వాలని అఠావ్‌లే
Advertisement