హాల్‌టికెట్ తప్పులు: 38 మంది పరీక్షకు దూరం
Published Fri, Nov 11 2016 11:50 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
ములుగు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలో హాల్‌టికెట్‌పై తప్పుడు అడ్రస్ అచ్చువేయడంతో.. 38 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. హాల్‌టికెట్‌పై ములుగు మెయిన్ రోడ్ జయశంకర్ జిల్లాకు బదులుగా.. ములుగు మెయిన్‌రోడ్ వరంగల్ జిల్లా అని అచ్చవడంతో.. అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు అడ్రస్ కనుక్కొని పరీక్ష కేంద్ర వద్దకు చేరుకునే సరికి పుణ్యకాలం ముగిసిందని వారిని లోనికి అనుమతించలేదు. దీంతో 38 మంది నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పరీక్ష కోసం సిద్ధమైన తమను పరీక్ష రాయనివ్వకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
Advertisement
Advertisement