సాక్షి, చెన్నై : కులాంతర వివాహం చేసుకునే ప్రేమికులు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వాడేందుకు అ నుమతించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పరువు హత్యలను తీవ్రంగా పరిగణించాలని ఓ పిటిషనర్ చేసిన విజ్ఞప్తిపై కోర్టు దృష్టి పెట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కులాంతర ప్రేమ వివాహాల అనంతరం పరువు హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటివరకూ వందకు పైగా పరువు హత్యలు జరిగినట్టు గణాం కాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ఈ ధర్మపురిలో ఇలవరసన్, ఓమలూరులో గోకుల్ రాజ్, ఉడుమలైలో శంకర్‌లు కులాంతర వివాహాలకు బలయ్యారు. వెలుగులోకి వ చ్చిన ఘటనలు కొన్నైతే , మరికొన్ని చడీ చప్పుడు కాకుండా జరిగి ఉన్నాయని చెప్పవచ్చు. ఇటీవల ఇలాంటి పరువు హత్యలను మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామన్నట్టు గా భరోసా ఇచ్చేందుకు సిద్ధం అ యింది. దీనికి అనుగుణంగా తగిన ఆదేశాలను మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ జారీ చేసినా హత్యల పర్వం మాత్రం ఆగడం లేదు.
ఈ పరిస్థితుల్లో పరువు హత్యల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని లేదం టే, కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు ఆత్మరక్షణార్థం ఆయుధాల్ని కలిగి ఉండే విధ ంగా అనుమతులు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. జర్నలిస్టు వరాహి దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. ప్రేమ వివాహాలు చేసుకునే వారికి భద్రత కల్పించేందుకు తగిన చట్టం తీసుకురావాలని కోరింది. ఆయుధాల లెసైన్స్‌లు కల్పించాలన్న వాదనలను పరిగ ణించిన బెంచ్ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు దీనిపై నోటీసులు జా రీ చేసింది. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు వివరణ ఇవ్వాలంటూ తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేశారు.
ప్రేమికులకు ఆయుధాలు
Published Tue, Jun 7 2016 2:52 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement