సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త. ఇళ్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. 70 వేల రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకూ తగ్గే అవకాశం ఉంది. సహ్యాద్రి అతిథి గృహంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాడా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనికి ఆమోదముద్ర వేయనున్నారు. కొన్ని సంవత్సరాలుగా మాడా నిర్మిస్తున్న ఇళ్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఇలా ఏటా ధరలు పెరగుతుండటంతో స్పందన తగ్గింది. ఇళ్లకోసం దరఖాస్తు చేసుకునేవారే కరువయ్యారు.
కారణమేంటని సమీక్షించిన మాడా ధరలు పెరిగిపోవడమేనని తెలుసుకుంది. దీంతో అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయిస్తే కొనుగోలుదారులనుంచి భారీగా స్పందన వస్తుందని అధికారులు భావించారు. అందుకోసం సమీక్షా సమావేశం నిర్వహించి ఇళ్ల వ్యయానికి వడ్డీ రేటును తగ్గించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 14.5 శాతం వడ్డీ విధిస్తున్నారు. ఇప్పుడు దానిని నాలుగుశాతం తగ్గించి 10 శాతం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఇళ్ల ధరలు 70 వేల నుంచి రెండున్నర లక్షలవరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇది జూన్ 15న నిర్వహించే లాటరీకి దరఖాస్తు చేసుకున్నవారికే వర్తిస్తుందని మాడా అధికారులు వెల్లడించారు.
మిల్లు కార్మికుల ఇబ్బందులు: మూతపడిన మిల్లు స్థలాల్లో కార్మికుల కోసం మాడా నిర్మించిన ఇళ్లను అర్హులకు అందజేయుడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. మాడా లాటరీ వేసి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. అందులో అర్హులైన కొందరికి మాత్రమే ఇళ్లు పంపిణీ చేయుడం జరిగింది. అనర్హులకు విచారణ (హియరింగ్) ప్రక్రియు పూర్తిచేయుగా వారు సంబంధిత పత్రాలు సమర్పించారు. వారిని అర్హులుగా పరిగణించి ఇళ్లు పంపిణీ చేయూలి. కాని కావాలనే జాప్యం చేస్తున్నారు. దీనిపై కార్మిక సంఘాలు నిలదీయగా పత్రాలు పరిశీలించే పనులు వెంటనే పూర్తిచేసి నెల రోజుల్లో ఇళ్లు అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ హామీ ఇచ్చి కూడా రెండు నెలలు పూర్తికావస్తోంది.
ఇంతవరకూ ఏ ఒక్కరికీ ఇంటిని అప్పగించలేదు. అర్హులైన పేదలు చెప్పులరిగేలా మాడా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది మాత్రం సకాలంలో పనులు పూర్తి చేయుడం లేదు. మొన్నటివరకు లోక్‌సభ ఎన్నికల పనుల్లో హడావుడిగా ఉన్న మాడా అధికారులు తిరిగి విధుల్లోకి చేరారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇదేమని ప్రశ్నిస్తే... ‘మీ ఫైలు సంతకాల కోసం పైఅధికారి వద్దకు పంపించామం’టూ దాటవేస్తున్నారు. సంతకాల పేరుతో నెలలు నెలలు తిప్పించుకుంటున్నారు. లంచాలు గుంజేందుకు కొందరు అధికారులు ఇలా సంతకాల డ్రామా ఆడుతున్నారని, కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లు కార్మిక సంఘాల ప్రతినిధులు దీనిపై దృష్టిసారించి వెంటనే ఇళ్ల పంపిణీ ప్రక్రియు పూర్తిచేసి వారికి న్యాయం చేయాలని కార్మిక నాయకుడు గన్నారపు శంకర్ విజ్ఞప్తి చేశారు.
భారీగా తగ్గిన మాడా ఇళ్ల ధరలు
Published Fri, May 23 2014 10:39 PM | Last Updated on Mon, Oct 8 2018 5:59 PM
Advertisement
Advertisement