గుంటూరు జిల్లాలో వరద బీభత్సం | Heavy rains in guntur | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో వరద బీభత్సం

Published Thu, Sep 22 2016 2:56 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో వరద బీభత్సం - Sakshi

గుంటూరు జిల్లాలో వరద బీభత్సం

- ఐదుమంది గల్లంతు
- కుప్పగంజ వాగులో నలుగురి గల్లంతు...
- బ్రాహ్మణపల్లి చెరువు కట్ట తెగి ఒకరి గల్లంతు

గుంటూరు: జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. అనుపాలెం-రెడ్డిగూడెం రైల్వే ట్రాక్‌పై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇక జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద కారు గల్లంతైంది. కారు నుంచి ముగ్గురు వ్యక్తులు బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. మరోవైపు బ్రాహ్మణపల్లి వద్ద వాగులో నలుగురు గల్లంతయ్యారు.  వారిలో ఒకరు మృతిచెందారు.
 
మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. అటు క్రోసూరు మండలం విప్పర్ల వద్ద ఎద్దువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పొలం పనులకు వెళ్లిన ముగ్గురు రైతులు నీటిలో చిక్కుకుపోయారు. మరోవైపు నకిరేకల్లులో పిడుగుపడి ఓ మహిళ మృతి చెందింది. నర్సరావుపేట సమీపంలోని జొన్నలగడ్డ వద్ద గల బ్రిడ్జ్ నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. మేడికొండూరులో అప్రోచ్ రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. గుంటూరు మాచర్ల, వినుకొండ వెళ్లే రహదారుల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయమవడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. 
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)
 
చిలకలూరిపేట మండలం అమీన్‌సాహెబ్ పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌కు కాపలాగా ఉంటున్న ఓ కుంటుంబం నీటిలో కొట్టుకుపోయింది. వారిలో ఓ బాలుడు చెట్టుకు వేలాడుతుండగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి సైతం గల్లంతయ్యాడు. కారంపూడి వద్ద ఎర్రవాగు, దాచేపల్లి వద్ద నాగులేరు, మాచర్ల వద్ద చంద్రవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నకరికల్లులో అత్యధికంగా 24.1 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. 
 
జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు:
నకరికల్లు- 24.1 సెం.మీ
నరసరావుపేట-22.4 సెం.మీ
మేడికొండూరు- 21 సెం.మీ
బెల్లంకొండ- 19.1 సెం.మీ
ముప్పాళ్ల- 18.6 సెం.మీ
ఫిరంగిపురం- 16.3 సెం.మీ
సత్తెనపల్లి- 16.1 సెం. మీ
పత్తిపాడు- 15.2 సెం. మీ
వట్టిచురుకూరు- 14.6 సెం.మీ
నాదెండ్ల- 14 సెం.మీ
పెదనందిపాడు - 11.9 సెం.మీ
పొన్నూరు- 11.7 సెం.మీ
పీవీపాలెం- 10.8 సెం.మీ
రొంపిచర్ల- 10.6 సెం.మీ
రాజుపాలెం- 10.3 సెం.మీ
కాకుమాను- 10.3 సెం.మీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement