కాజల్‌ అగర్వాల్‌కు హైకోర్టులో చుక్కెదురు | High Court shock to the Actress Kajal Aggarwal | Sakshi
Sakshi News home page

కాజల్‌ అగర్వాల్‌కు హైకోర్టులో చుక్కెదురు

Published Thu, Aug 10 2017 1:34 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

కాజల్‌ అగర్వాల్‌కు హైకోర్టులో చుక్కెదురు - Sakshi

కాజల్‌ అగర్వాల్‌కు హైకోర్టులో చుక్కెదురు

తమిళ సినిమా (చెన్నై): సినీ నటి కాజల్‌ అగర్వాల్‌కు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. వీవీడీ కొబ్బరినూనె తయారీ సంస్థపై కాజల్‌ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. 2008లో వీవీడీ కొబ్బరినూనె ప్రకటనలో నటించడానికి ఆ సంస్థతో కాజల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్క ఏడాదిపాటే ప్రసారంచేయాలనే నిబంధనతోనే ఆ ప్రకటనలో నటించానని, కానీ దాన్ని ఆ తర్వాతా ప్రసారంచేశారని ఆరోపిస్తూ ఆమె 2011లో మద్రాసు హైకోర్టులో కేసు వేశారు.

ఆ ప్రకటన ప్రసారాన్ని నిలిపివేయాలని, నిబంధనలు అతిక్రమించి ప్రసారం చేసినందుకు తనకు రూ. 2.50 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా సంస్థను ఆదేశించాలని కోర్టును కోరారు. బుధవారం తుది విచారణ జరిపిన జడ్జి జస్టిస్‌ టీ రవీంద్రన్‌ కాపీరైట్స్‌ చట్టప్రకారం ఒక ప్రకటన దాన్ని రూపొందించిన సంస్థకే చెందుతుందన్నారు. ఒక్క ఏడాదే ఆ ప్రకటనను ప్రసారం చేయాలనే హక్కు కాజల్‌కు లేదన్నారు. ఒక వాణిజ్యప్రకటన ప్రమోషన్‌ హక్కులు ఆ సంస్థకు 60 ఏళ్ల వరకూ ఉంటాయని తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement