బడ్జెట్ ప్రతిపాదనలపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: మార్చి 8వ తేదీ నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సమర్పించనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి పద్దు, నిర్వహణ పద్దుల గురించి చర్చిస్తున్నారు. మార్చి 11న వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 18 రోజులపాటు సమావేశాలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సమావేశంలో మంత్రి ఈటల, అధికారులు పాల్గొన్నారు.