
పవన్‌కల్యాణ్ ఇప్పుడెందుకు ఉద్యమించరు?
హొసూరు(తమిళనాడు): తమిళనాడులో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న భాష, సాంస్కృతిక సమస్యలపై పవన్‌కల్యాణ్ ఎందుకు ఉద్యమించరని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రశ్నించారు. హొసూరులో రెండో రోజైన ఆదివారం జరిగిన త్యాగరాయస్వామి జయంత్యుత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తమిళనాడులో తెలుగు భాష దుస్థితిపై అప్పట్లో హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించగా, స్పందించిన పవన్‌కల్యాణ్ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారన్నారు. అయితే ఇప్పటికీ దాని ఊసెత్తడం లేదని జగదీశ్వరరెడ్డి మండిపడ్డారు. అనంతరం కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డిని తెలుగు సంఘాలు సన్మానించాయి.