యశవంతపుర : విలాస జీవనం గడపడానికి భర్తతో దోపిడీలు చేయిస్తున్న భార్యను పోలీసులు అరెస్టు చేశారు. గొలుసు దొంగ అచ్యుత్‌కుమార్ అలియాస్ ఘణిపై బెంగళూరుతో పాటు రాష్ట్రంలో సుమారు 150 కేసులున్నాయి. విలాస జీవనం కోసం భర్త కొట్టుకొచ్చిన చేసిన గొలుసులను భార్య మహాదేవి విక్రయించి జల్సాలు చేసేది. ఏడాదిలో రూ.కోటిన్నర విలువైన బంగారు ఆభరణాలు కూడబెట్టింది. మూడు నెలల క్రితం నైస్ రోడ్డులో అచ్యుత్‌కుమార్‌పై కెంగేరి పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేసినప్పుటి నుండి మహదేవి అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె ఒక అనాథాశ్రమంలో తలదాచుకుని ఉండగా అరెస్ట్ చేసినట్లు కెంగేరి పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment