‘నిజాం షుగర్స్ పై సర్కార్ స్పందించాలి’
‘నిజాం షుగర్స్ పై సర్కార్ స్పందించాలి’
Published Thu, Jan 12 2017 3:48 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 49 శాతం వాటా సర్కార్‌కు ఉందని, కాబట్టి దీనిపై సర్కార్ వెంటనే స్పందించి సమస్యలు తీర్చాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నిజాం షుగర్ మూసి వేసిన కారణంగా కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. వెంటనే కార్మికులకు ఇవ్వవలసిన 13 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని అసెంబ్లీలో సర్కార్ వాదించడాన్ని తప్పు పట్టారు. సింగరేణి ఓపెన్ కాస్టుపై, ముస్లిం రిజర్వేషన్లు, విద్యార్థి సమస్యలపై త్వరలోనే సదస్సు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం కూడా త్యాగం చేసిన ప్రజలను మానవతా దృష్టి కోణంలో చూడాలన్నారు. అభివృద్ధిలో నిర్వాసితులను పట్టించుకోకుండా సర్కార్ ముందుకు వెళ్లడం సరికాదన్నారు.
Advertisement
Advertisement